Pawan Kalyan Ramcharan JrNTR.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, జనసేన అధినేత హోదాలో.. కీలక వ్యాఖ్యలు చేశారు.. పెద్ద హీరోలు, చిన్న హీరోలు.. అన్న విషయమై.!
వారాహి విజయ యాత్రలో భాగంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పర్యటిస్తున్న జనసేనాని, తనకంటే ఎక్కువ రెమ్యునరేషన్ ప్రభాస్, మహేష్ లాంటి హీరోలు తీసుకుంటున్నట్లు చెప్పారు.
‘నాకేమీ ఇగో లేదు. అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీయార్.. ఇలా ఏ హీరో అన్నా నాకు ఇష్టమే. నేనూ వాళ్ళ సినిమాలు చూస్తాను..’ అని చెప్పుకొచ్చారు పవన్ కళ్యాణ్.
‘రామ్ చరణ్, జూనియర్ ఎన్టీయార్.. ఇప్పుడు గ్లోబల్ స్టార్స్. నేను అంతలా ఎవరికీ తెలియకపోవచ్చు..’ అని కూడా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.
Pawan Kalyan Ramcharan JrNTR.. చిన్నా.. పెద్దా.. ఆ తేడా లేదిప్పుడు.!
‘కార్తికేయ-2’ సినిమాతో నిఖిల్ సిద్దార్ధ పాన్ ఇండియా హీరో అయిపోయాడు. ఒకే ఒక్క సినిమా ‘కేజీఎఫ్’తో కన్నడ నటుడు యష్ దక్కించుకున్న జాతీయ ఖ్యాతి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.
పవన్ కళ్యాణ్ నిజానికి ప్రాక్టికల్ మనిషి.! సినిమాలు వేరు, రాజకీయాలు వేరని ఆయన స్పష్టంగా చెప్పేశారు.

‘ఏ హీరోని అయినా అభిమానించండి.. రాజకీయాల్ని దానికి దూరంగా వుంచండి. రాజకీయాలకొచ్చేసరికి.. మీకు మేలు చేసే పార్టీని, నాయకుడ్ని ఎన్నుకోండి..’ అని చెబుతున్నారు జనసేనాని.
అభిమానుల మధ్య గొడవ చల్లారుతుందా.?
రామ్ చరణ్ – పవన్ కళ్యాణ్ మధ్య చిచ్చు పెట్టేందుకు అభిమానం ముసుగేసుకున్న కొందరు దురభిమానులు ప్రయత్నించిన సంగతి తెలిసిందే.

అంతెందుకు.? చిరంజీవి – పవన్ కళ్యాణ్ మధ్య కూడా చిచ్చు పెట్టే ప్రయత్నాలు జరుగుతుంటాయి. అదే రాజకీయం అంటే.!
Also Read: Nikhil Siddhartha Propaganda Star: జాతీయ సమస్యే.!
ఈ నేపథ్యంలోనే, హీరోల అభిమానులు ఆత్మవిమర్శ చేసుకునేలా పవన్ కళ్యాణ్, కీలక వ్యాఖ్యలు చేశారు. చిన్న, పెద్ద హీరోలెవరూ లేరిక్కడ.
ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో తెలిసినోడే గొప్పోడు.! ఇది కేవలం సినిమా డైలాగ్ మాత్రమే కాదు.! ఇది పవన్ కళ్యాణ్‌కి అతికినట్టు సరిపోతుంది.