Trees Leaves Humans Begging.. గో గ్రీన్.! ప్రకృతిని ప్రేమిద్దాం.! పర్యావరణాన్ని పరిరక్షించుకుందాం.! మొక్కల్ని పెంచుకుందాం.!
అబ్బో.. వినేవాడు వెర్రి వెంగళప్ప అయితే, చెప్పేటోడు మహా మేధావి.! అంతే మరి, కాదని అనగలమా.?
పొద్దున్న లేస్తే.. రోడ్ల మీదనో, బస్సుల్లోనో.. లేదంటే, ఇంకో చోటనో.. మొక్కల పెంపకం గురించి మంచి మంచి మాటల్ని వింటుంటాం.. చూస్తుంటాం.!
Trees Leaves Humans Begging.. పెంచుతున్నామా.? తుంచుతున్నామా.?
ఇక్కడ ఓ ఫొటో చూస్తున్నాం కదా.? సిగ్గు పడాల్సిన విషయమిది. ఎండిపోయిన ఓ మొక్క, బిచ్చమెత్తుకుంటోంది. నాలుగు ఆకుల్ని బిచ్చంగా వేస్తున్నాడో గొప్పాయన.!
ఎవరి కోసం చెట్టు బతుకుతుంది.? తన బతుకు మాత్రమే తాను బతకట్లేదు. జీవ కోటి కోసం బతుకుతోంది.!

ప్చ్.. ఆ చెట్టుని చంపేస్తున్నాం.! అందుకే, చెట్టు బిచ్చమెత్తుకోవాల్సి వస్తోంది. అది బతకడం కోసం కాదు సుమీ, మనల్ని బతికించడం కోసమే.
గుండెల్ని పిండేస్తోంది.!
కాస్సేపు ఈ బొమ్ని చూస్తే.. నిజంగానే, గుండెల్ని పిండేస్తుంది. ఊపిరి ఆడని సంకట పరిస్థితి ఏర్పడుతుంది.
అయినా, మన దగ్గర ఆకులున్నాయా బిచ్చం వెయ్యడానికి.? ఎన్ని డబ్బులుంటే మాత్రం, కోవిడ్ సమయంలో ఆక్సిజన్ కొనుక్కోలేక కదా చాలా ప్రాణాలు పోయింది.?
Also Read: టైటానిక్ విషాదం! ఐదుగుర్ని మింగేసిన ఓసియన్ గేట్ ‘టైటాన్’!
అసలంటూ భూమ్మీద ఆక్సిజన్ లేకపోతే, మనిషి బతికేదెలా.? బైకులు, కార్లు, విమానాలు.. ఇవి వుంటే సరిపోతుందా.?
ఎత్తయిన భవనాలతో సరిపెట్టుకుందామా.? కనిపించిన భూమినంతటినీ కబ్జా చేసుకుంటూ వెళ్ళిపోదామా.? ఒక్కసారి ఆలోచించండి.! కాస్తంత సిగ్గుపడదాం ఇకనైనా.!
వారసత్వంగా కోట్లాది రూపాయల విలువైన ఆస్తుల్ని ఇవ్వగలమేమో.! పచ్చని ప్రకృతిని ఇచ్చేందుకు ప్రయత్నించగలమా.? అంత బాధ్యత మనకుందా.?
భవిష్యత్ తరాలకు అందమైన ప్రకృతిని మిగల్చలేని మనం, మన వారసులకి ద్రోహం చేస్తున్నట్లే కదా.?
ఆత్మ విమర్శ ఎప్పుడు.? అంతా నాశనమైపోయాక ఏడ్చి ఏం ప్రయోజనం.? అతిథుల్లా భూమ్మీద మనం బ్రతుకుతున్నాం.. దేన్నీ పాడు చేయకుండా.. బతికినన్నాళ్ళూ ప్రకృతిని ఎంజాయ్ చేద్దాం.!