Table of Contents
Hbd Nandamuri Balakrishna Akhanda2.. నందమూరి బాలకృష్ణ అంటే, కొందరికి మాస్ హీరో.! ఇంకొందరికి మంచి మనిషి. మరికొందరికి, ట్రోల్ కంటెంట్.!
ఎవరేమనుకున్నాసరే, డోన్ట్ కేర్.. ఇదీ నందమూరి బాలకృష్ణ తీరు. బ్లడ్డు.. బ్రీడు.. అని వ్యాఖ్యానించినా.. బురద జాతి.. అని మాట్లాడినా, బాలయ్య రూటే సెపరేటు.!
హిందూపురం నియోజకవర్గం నుంచి వరుసగా మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు నందమూరి బాలకృష్ణ. బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ఛైర్మన్‌గా ఆయన అందిస్తున్న సేవలు సమ్‌థింగ్ వెరీ స్పెషల్.
Hbd Nandamuri Balakrishna Akhanda2.. పద్మభూషణుడు బాలయ్య..
నందమూరి బాలకృష్ణకు ఇటీవలే భారత దేశంలోని అత్యున్నత పౌర పురస్కారాల్లో ఒకటైన పద్మ భూషణ్ పురస్కారం దక్కింది.
సినీ రంగంలోనూ, సేవా రంగంలోనూ.. ఆయన సంపాదించుకున్న కీర్తి ప్రతిష్టలకు లభించిన గౌరవంగా పద్మ భూషణ్ పురస్కారాన్ని అభివర్ణించొచ్చు.
తెలుగు సినీ పరిశ్రమకి సంబంధించి, నలుగురు అగ్ర హీరోలు.. అనే ప్రస్తావన వస్తే, అందులో బాలయ్య కూడా ఒకరు.. అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
హిట్టూ.. ఫ్లాపూ.. వీటికి అతీతంగా..
బాలయ్య సినిమా హిట్టయినా, ఫ్లాపయినా.. ఆ లెక్కే వేరంటారు అభిమానులు. ఫ్లాపు సినిమాల్ని కూడా సంవత్సరాల తరబడి ఆడించేస్తుంటారు బాలయ్య అభిమానులు.
వయసు మీద పడ్డాక, నటుడిగా బాలయ్య దూకుడుని వేరే లెవల్‌లో చూస్తున్నాం. ‘అఖండ-2’ సినిమా త్వరలో విడుదల కానుంది. మరికొన్ని ప్రెస్టీజియస్ ప్రాజెక్టులు లైన్లో వున్నాయ్.
సినిమాలు, రాజకీయాల సంగతి పక్కన పెడితే, ‘అన్‌స్టాపబుల్ టాక్ షో’ బాలయ్య ఇమేజ్‌ని వేరే లెవల్‌కి తీసుకెళ్ళిందని నిస్సందేహంగా చెప్పొచ్చు.
‘జై బాలయ్య’ అనే మాట ఓ వ్యసనంగా మారిందంటే, అందులో ‘అన్‌స్టాపబుల్ టాక్ షో’ పాత్ర చాలా చాలా ఎక్కువే మరి.
అన్‌స్టాపబుల్ బాలయ్య..
సినిమాలు, రాజకీయాలు.. వీటితోపాటు టాక్ షో.. వెరసి, నందమూరి బాలకృష్ణ నిజంగానే అన్‌స్టాపబుల్.. అని చెప్పక తప్పదు.
మంత్రిగా, ముఖ్యమంత్రిగా తమ అభిమాన హీరో నందమూరి బాలకృష్ణని చూడాలని ‘బాలయ్య’ అభిమానులు కోరుకుంటున్న దరిమిలా, ఆ కోరిక ఎప్పుడు తీరుతుందో ఏమో.!
Also Read: రాజేంద్ర ప్రసాద్ క్షమాపణ: దెబ్బకి దెయ్యం దిగొచ్చింది.!
అన్నట్టు, త్వరలోనే తన కుమారుడు మోక్షజ్ఞనని సినీ రంగానికి నందమూరి బాలకృష్ణ పరిచయం చేయనున్న సంగతి తెలిసిందే.
నేడు పుట్టినరోజు జరుపుకుంటున్న నందమూరి బాలకృష్ణకి జన్మ దిన శుభాకాంక్షలు.