Table of Contents
Telugu Media Tegulu Mafia.. పిచ్చి ముదిరిపోతే ఇలాగే వుంటుంది.! చేసేది తప్పుడు పని.! దాన్ని సమర్థించుకునే క్రమంలో, అత్యంత జుగుప్సాకరమైన స్థాయికి దిగజారిపోవడమొకటి.!
సెలబ్రిటీలకు సంబంధించి ఏ వార్త అయినా, హాట్ హాట్‌గానే వుంటుంది. సినీ సెలబ్రిటీలకు మరీనూ.!
కాలికి ధరించే చెప్పుల దగ్గర్నుంచి, లోపల వేసుకునే ‘చెడ్డీల’ వరకు.. అన్నిటి మీదా ఈ మధ్య మీడియా ఫోకస్ ఎక్కువైపోయింది.
Telugu Media Tegulu Mafia.. పెళ్ళికి పబ్లిసిటీ..
సెలబ్రిటీలు ప్రేమలో పడితే.! పడ్డారో లేదో.. ముందైతే గాసిప్స్ పుడతాయ్. ఒకవేళ నిజంగానే వాటిల్లో కొన్ని నిజమైతే.. సోకాల్డ్ మీడియాకి అది పండగే.!
అక్కడ తిరుగుతున్నారు.. ఇక్కడ తిరుగుతున్నారు.. ఇలా కుప్పలు తెప్పలుగా వార్తలు వండి వడ్డించేస్తుంటారంతే.!
తీరా బ్రేకప్ అయిపోతే.! బ్రేకప్ అయినా, అవ్వకపోయినా.. సోకాల్డ్ మీడియా అయితే, బ్రేకప్ పైశాచికానందాన్ని ముందే పొందేస్తుంది.
పెళ్ళి విషయంలోనూ అంతే..
సెలబ్రిటీలు ప్రేమలో పడి, పెళ్ళిని కూడా ప్రకటించేస్తే.. ఆ కథ వేరేలా వుంటుంది. ‘పెళ్ళి ఆగిపోయిందట..’ అన్న ప్రచారం దగ్గర్నుంచి, శోభనం రగడ వరకు.. కాదేదీ గాసిప్పులకనర్హం.!
చివరికి పెళ్ళి వర్కవుట్ కాక, విడిపోతే మరో తంతు. వైవాహిక బంధాన్ని వాళ్ళు సజావుగా కొనసాగిస్తున్నా, వాళ్ళని విడదీసేదాకా సోకాల్డ్ మీడియా ఊరుకోదు.
పోనీ, విడాకుల విషయాన్ని కాస్త గోప్యంగా (అధికారికంగా విడాకులు మంజూరయ్యేదాకా) వుంచాలనుకున్నా, సోకాల్డ్ మీడియా ఊరుకుంటుందా.? ఛాన్సే లేదు.
మీడియాకి అన్నీ చెప్పే చేయాలట. అలాగని, ఓ గ్రేట్ లఫూట్‌గాడు తన మీడియా కథనాల ద్వారా తెగేసి చెబుతున్నాడు.
ఎవరు ఎవర్ని ఉద్ధరిస్తున్నారు.?
మీడియా, సెలబ్రిటీలను ఉద్ధరించదు. సెలబ్రిటీలే మీడియాని ఉద్ధరిస్తారు.! కొందరు మీడియాని, పబ్లిసిటీ కోసం వాడుకుంటారేమో. అందరూ ఆ పని చెయ్యరు.!
అయినా, ఇప్పుడు మీడియా ఎక్కడుంది.. అంతా మాఫియా అయితేనూ.! మీడియా వేరు, ఇప్పుడు నడుస్తున్న మాఫియా వేరు.
Also Read: ‘వారాహి’ అంటే పంది కాదు.! దేవతరా.! అచ్చోసిన ఆంబోతూ.!
వందల కోట్లు.. వేల కోట్లు.. లక్షల కోట్లు మింగేస్తున్న రాజకీయ నాయకుల్ని మీడియా నిలదీస్తే, ప్రజలకు ఉపయోగం.!
సెలబ్రిటీల మీద వెకిలి ప్రచారాలు చేసి, అడ్డగోలుగా ప్రశ్నిస్తే.. సమాజానికి ఏంటి లాభం.? మీడియా అని చెప్పుకోవడానికైనా సిగ్గుండాలి కదా.?