Rangabali Review Naga Shaurya.. యంగ్ హీరో నాగ శౌర్య తాజా చిత్రం ‘రంగబలి’ ప్రేక్షకుల ముందుకొచ్చింది. సినిమా మీద అతి నమ్మకంతో, నిన్న సాయంత్రమే ప్రీమియర్స్ పడ్డాయ్.!
నిన్నే సినిమాకి సంబంధించిన టాక్ బయటకు వచ్చేసింది. అయితే, పెయిడ్ టాక్ విపరీతంగా నడిచింది. మామూలుగా కాదు.. హిట్టు.. సూపర్ హిట్టు.. బంపర్ హిట్టు.. ఇలాగన్నమాట.!
ఏమాటకామాటే చెప్పుకోవాలంటే, సినిమా కోసం పబ్లిసిటీ బాగా చేశారు. పైగా, విపరీతమైన పబ్లిసిటీ. దాంతో, ప్రీమియర్స్‌కి మంచి బజ్ క్రియేట్ అయ్యింది.. ప్రీమియర్స్ అన్నీ ఫుల్ అయిపోయాయ్.!
Rangabali Review Naga Shaurya.. ఇంతకీ.. బొమ్మ ఎలా వుంది.?
ఫస్టాఫ్ బావుందంటూ తొలుత ప్రచారం జరిగింది. అందులో నిజం లేకపోలేదు. కమెడియన్ సత్య వన్ మ్యాన్ షో.. సినిమాని వేగంగా ముందుకు నడిపించింది.
కానీ, ఇంటర్వెల్ తర్వాత కథ (Rangabali) మారిపోయింది. అడ్డదిడ్డంగా సాగింది కథ. ఏం జరుగుతోందో ప్రేక్షకుడికి అర్థం కాలేదు.
కథేంటంటే..
రాజవరం అనే ఊళ్ళో.. సరదాగా తిరిగేసే కుర్రాడు మన హీరో.!
సొంత మెడికల్ షాపులోనే చిల్లర దొంగతనాలు చేస్తుంటాడు. కొడుకుని ప్రయోజకుడ్ని చేసేందుకోసం వైజాగ్ పంపిస్తాడు హీరోగారి తండ్రి.!
అక్కడ హీరోయిన్‌తో ప్రేమలో పడతాడు మన హీరో.
హీరో – హీరోయిన్లు కలవడానికి హీరో సొంతూరు రాజవరంలోని రంగబలి సెంటర్ వ్యవహారం అడ్డంకిగా మారుతుంది.
అసలేంటి ఆ రంగబలి సెంటర్ కథ.? అది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.!
Rangabali Story
ఎందుకిలా.? దర్శకుడు తడబడ్డాడా.? సరిగ్గా స్క్రిప్ట్ (Rangabali Movie) మీద వర్క్ చేయలేదా.? ఓవర్ కాన్ఫిడెన్సా.? ఏమైనా అనుకోవచ్చు.

సినిమా అయిపోయిందా.? ఇంకా వుందా.? అన్న కన్‌ఫ్యూజన్.. సినిమా ముగిశాక ప్రేక్షకుడికి కలుగుతుంది. అలా సగంలోనే సినిమాని వదిలేసినట్టుంది పరిస్థితి.
చాలా చెప్పారుగానీ..
సినిమాని ముందే వేసేవారని ఇప్పటికే చెప్పుకున్నాం కదా.! ప్రీమియర్స్ నేపథ్యంలో పెయిడ్ టాక్‌తో సినిమాకి బజ్ తీసుకొచ్చేద్దామనుకున్నారు.
అది కాస్తా, ఇప్పుడు తేడా కొట్టేసింది. అంతటా నెగెటివ్ టాక్ వినిపిస్తోంది. దాంతో, ఈ రోజు మార్నింగ్ షోస్‌కి జనమే పెద్దగా కనిపించని పరిస్థితి.
ఎందుకింత అత్యుత్సాహం.? ఏం సాధించారు ప్రీమియర్స్ ద్వారా.?
Also Read: Salaar Teaser Prabhas.. ‘సలార్’.. కంటెంటున్నోడి కటౌటు.!
కథ ఓకే.. కానీ, చాలా సన్నివేశాల్లో దర్శకుడు చికాకు పుట్టించేశాడన్నది ప్రేక్షకుల నుంచి వస్తోన్న ముఖ్యమైన ఫిర్యాదు.!
నాగ శౌర్య బాగా చేశాడు.. కానీ, అతన్ని బాగా వాడుకోలేకపోయాడు దర్శకుడు. ఇది ఇంకో కంప్లయింట్.! అబ్బో, బోల్డన్ని వున్నాయ్.. మైనస్ పాయింట్స్.!

సత్య కామెడీ ఒక్కటే కాస్త ఊరట.! కొన్ని మాస్ ఎలిమెంట్స్ వర్కవుట్ అయ్యాయిగానీ, ప్చ్.. ఓవరాల్‌గా సినిమా ఔట్.. అనే అభిప్రాయం అంతటా వ్యక్తమవుతోంది.
సినిమా కోసం అస్సలు రాజీ పడకుండా ఖర్చు చేశారు. ప్రమోషన్ల కోసం కూడా అతిగానే ఖర్చు చేశారు.! ఏం లాభం.? అంతా బూడిదలో పోసిన పన్నీరే.!