CSK Yellow Elephant Dhoni.. మామూలుగా అయితే వైట్ ఎలిఫెంట్ అంటుంటాం.! పోషణ దండగ.. అనే కోణంలో ఈ ప్రస్తావన చేస్తుంటాం.
చెన్నయ్ సూపర్ కింగ్స్ (Chennai Super Kings) అంటే, యెల్లో ఆర్మీ గనుక.. ఇప్పుడు ఎంఎస్ ధోనీని, యెల్లో ఎలిఫెంట్ అనాలేమో.!
అసలు, ధోనీని ఎల్లో ఎలిఫెంట్ అని ఎందుకు అనాలి.? పోషణ దండగ.. అని ఎందుకు అనాల్సి వస్తోంది. ‘తల’ అంటూ, ధోనీని అభిమానించే, చెన్నయ్ సూపర్ కింగ్స్ జట్టు అభిమానులే ఇలా ఎందుకు అంటున్నారు?
వయసు.. ఫిట్నెస్.. ఆట తీరు.. ఇవన్నీ, జెంటిల్మెన్ గేమ్ క్రికెట్‌లో అత్యంత కీలకం. మైదానంలో రాణిస్తేనే, క్రికెట్‌లో ఏ ఆటగాడికైనా గుర్తింపు. ఫెయిల్ అయితే, నిర్దాక్షిణ్యంగా తిట్టిపోస్తారు.
CSK Yellow Elephant Dhoni.. ఎవరూ.. అతీతం కాదు.!
సచిన్, గంగూలీ, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ.. ఆ మాటకొస్తే, సునీల్ గవాస్కర్, సిద్దూ, కపిల్ దేవ్, రవి శాస్త్రి.. ఇలా ఎవరికీ తప్పలేదు.. అవమానాలు.
టీ20 ఫార్మాట్‌లో జరిగే, ఐపీఎల్ విషయంలో, ధోనీ.. బోల్డంత ఫాలోయింగ్ వున్నోడు.. అదే సమయంలో, దారుణంగా ట్రోలింగ్‌ని ఎదుర్కొంటున్నాాడు కూడా.!
వయసు మీద పడ్డంతో, అంతర్జాతీయ క్రికెట్‌కి ఎప్పుడో గుడ్ బై చెప్పేశాడు ధోనీ. కానీ, ఐపీఎల్‌లో ఆడుతూనే వున్నాడు. వికెట్ కీపింగ్ విషయంలో ధోనీలో ఆ స్పార్క్ ఇంకా తగ్గలేదా.? బ్యాటింగ్ పరిస్థితేంటి.?
నిన్నటి మ్యాచ్‌లో ఆర్సీబీ దెబ్బకి సీఎస్కే ఔట్ అయిపోయింది. ధోనీ, చివర్లో మమ అనిపించాడంతే. ఓ స్టంపింగ్ మాత్రం మెరుపు వేగంతో చేశాడు.
వయోభారం.. నెమ్మదించిన ధోనీ వేగం..
ఒక్కటి మాత్రం నిజం.. ధోనీ బ్యాటింగ్ తీరు బాలేదు. వికెట్ కీపింగ్ విషయంలోనూ ఇబ్బందులు పడుతున్నాడు. మెరుపు వేగంతో ఓ స్టంపింగ్ చేస్తే సరిపోదు కదా.? అన్నీ వుండాలి.
గౌరవ ప్రదంగా ధోనీ, ఐపీఎల్ నుంచి కూడా ఆటగాడిగా తప్పుకుంటేనే మంచిది. కానీ, ఐపీఎల్ అంటే, స్టార్‌డమ్ చుట్టూ నడిచే ఆట కూడా. అదీ అసలు సంగతి.
Also Read: సనాతనంపై విషం: పాత్రికేయ వనంలో గంజాయి మొక్కలు.!
కానీ, ధోనీ ఫెయిల్ అయిన ప్రతిసారీ, ఆయన ఎదుర్కొనే ట్రోలింగ్.. అతని అభిమానులకు అస్సలు నచ్చడంలేదు.
టీమిండియాకి ఎంత అద్భుతమైన సేవలందించాడు.. సీఎస్కే తరఫున.. ఎన్ని మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు.. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి కదా.. అంటారు ధోనీ అభిమానులు.
కానీ, అలాగని యెల్లో ఎలిఫెంట్‌ని మేపడమంటే కష్టమైన వ్యవహారమే కదా.! అద్గదీ అసలు సంగతి.