Pawan Kalyan YSRCP Volunteers.. జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ మీద ఆంధ్రప్రదేశ్‌లో ‘వాలంటీర్లు’ గుస్సా అయ్యారు. వైసీపీ హయాంలో వాలంటీర్ వ్యవస్థ తెరపైకొచ్చిన సంగతి తెలిసిందే.
వాలంటీర్లు అంటే ప్రభుత్వ ఉద్యోగులు కారు. వైసీపీ కార్యకర్తలకు ‘వాలంటీర్’ పోస్టులు ఇచ్చి, ప్రతి నెలా వారికి ఐదు వేల రూపాయల గౌరవ వేతనం అందిస్తోంది ప్రభుత్వం.
ప్రతి యాభై ఇళ్ళకూ ఓ వాలంటీర్‌ని కేటాయించి, సంక్షేమ పథకాలు వారికి నేరుగా అందేలా వైసీపీ (YSR Congress Party) ప్రభుత్వం చేస్తోంది.
Pawan Kalyan YSRCP Volunteers.. వాలెంటీర్లెందుకు గుస్సా అయినట్టు.?
వాలంటీర్లు ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తున్నారు.. అదీ ప్రభుత్వం కోసం. దాన్ని వైసీపీ నేతలు కొందరు దుర్వినియోగం చేస్తున్నారన్నది జనసేన అధినేత ఆరోపణ.
రాష్ట్రంలో మహిళలు అదృశ్యమవుతున్నారనీ, దీని వెనుక కొందరు వైసీపీ నేతల హస్తం వుందనీ, వాలంటీర్లు సేకరించిన సమాచారంతోనే.. వైసీపీ నేతలు అకృత్యాలకు పాల్పడుతున్నారని జనసేనాని ఆరోపించారు.
దీన్ని వాలంటీర్లు తప్పుగా అర్థం చేసుకున్నారా.? వారికి తప్పుగా అర్థం అయ్యేలా వైసీపీ ప్రొజెక్ట్ చేసిందా.? అన్న విషయాన్ని పక్కన పెడితే, వాలంటీర్లు మాత్రం రోడ్డెక్కారు.
జనసేన అధినేత దిష్టిబొమ్మల్ని వాలంటీర్లు తగలబెట్టారు రాష్ట్ర వ్యాప్తంగా. కానీ, అక్కడ జనసేన అధినేత మాట్లాడింది, వాలంటీర్ల గురించి కాదు.. వైసీపీ నేతల గురించి.
నిజం.. నిలకడమీదనే అర్థమవ్వాలి..
కాస్త నిలకడగా ఆలోచిస్తే, వాస్తవమేంటన్నది అర్థమవుతుంది. ఈ రోజుల్లో నెలకు ఐదు వేల రూపాయలు.. అది గౌరవ వేతనమైనా, దానికోసం ఎవరు పని చేస్తారు.?
అంత తక్కువ మొత్తానికి పని చేసేలా వాలంటీర్ల పేరుతో యువతను బలి చేయడాన్ని జనసేన (Jana Sena Party Chief Pawan Kalyan) అధినేత తప్పు పడుతున్నారు.
Also Read: న్యూసూ న్యూసెన్సూ! ఎనకటి రెడ్డిగాడి పెళ్ళాం లేచిపోయిందట!
ఈ విషయాన్ని కాస్త జాగ్రత్తగా పరిశీలిస్తే, వాలంటీర్లకు అసలు విషయం అర్థమవుతుంది. దురదృష్టం, ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు అలా లేవు.!
వాలంటీర్ పోస్టులన్నీ వైసీపీ కార్యకర్తలకే ఇచ్చుకున్నట్లు వైసీపీ నేతలు చాలా సందర్భాల్లో చెప్పారు. వైసీపీకి వ్యతిరేకంగా పని చేస్తే, వాలంటీర్లను తొలగిస్తామనీ మంత్రులు హెచ్చరించిన సందర్భాలున్నాయ్.
సో, రోడ్డెక్కిన వాలంటీర్లు వైసీపీ కార్యకర్తలవుతారు తప్ప, ప్రజల కోసం పనిచేసే వాళ్ళెలా అవుతారు.?
ప్రజా ధనాన్ని వైసీపీ కార్యకర్తల కోసం ‘గౌరవ వేతనం’గా దుర్వినియోగం చేస్తున్న వైసీపీ, వాళ్ళని అడ్డం పెట్టుకుని ఇదిగో.. ఇలా రోడ్డెక్కి ధర్నాలు చేయిస్తోంది.
వాలంటీర్లని, రాజకీయ ప్రత్యర్థుల దిష్టబొమ్మల్ని దహనాలు చేసే అరాచకవాదులుగా తయారు చేస్తోంది.