Smart Mobile Phone.. విన్నారా.? ఈ చోద్యం చూశారా.? ఔనట, మొబైల్ ఫోన్లు.. మొగుడూ పెళ్ళాలని విడదీస్తున్నాయట.! ఓ అధ్యయనంలో అలాగని తేలిందట.!
ఓసోస్.. ఈ మాత్రందానికి అధ్యయనాలదాకా ఎందుకు.? ఇంట్లో స్మార్ట్ ఫోన్ వాడుతున్న భార్యాభర్తల్ని అడిగితే, ‘మొబైల్ ఫోన్’ పెట్టే చిచ్చు గురించి కథలు కథలుగా చెప్పేస్తారు కదా.!
ఎక్కడో.. నూటికో కోటికో ఓ జంట వుంటుంది.. మొబైల్ ఫోన్ కారణంగా గొడవ పడకుండా వుండే జంట.! ఈ రోజుల్లో అది చాలా అరుదైన విషయం మరి.!
73 శాతం మంది అభ్యంతరం.. అయినా తప్పని వైనం.!
మొబైల్ ఫోన్‌తో కాలక్షేపం విషయమై భార్యాభర్తల మధ్య అభ్యంతరాలకు సంబంధించి అధ్యయనం చేస్తే, సర్వేలో ‘73’ శాతం ఇబ్బంది పడుతున్నట్లు తేలింది.
అన్నట్టు, మొబైల్ ఫోన్లో తమ మెదళ్ళను ఇరికించేస్తున్న వ్యక్తులు తమ జీవిత భాగస్వామి ఏదన్నా విషయమ్మీద మాట్లాడితే విరుచుకుపడడం అనేది 70 శాతం మంది వ్యక్తుల్లో కనిపిస్తోందట.

ఇదేదో విదేశాల్లో జరిగిన సర్వే కాదు.. మన దేశంలో జరిగిన సర్వేనే.! వామ్మో మరీ ఇంత దారుణమా అనకండి.. శాంపిల్స్ సరిగ్గా తీసి వుండరు.
సరిగ్గా గనుక శాంపిల్స్ తీస్తే, నూటికి 90 శాతం పైగానే ‘స్మార్ట్’ బాధితులు వుంటారని తేలుతుంది మరి.!
Smart Mobile Phone.. వదిలించుకోలేని వ్యసనమిది.!
బ్యాంకింగ్ కార్యకలాపాలు, ఎంటర్టైన్మెంట్, చిన్నా చితకా వ్యాపారాలు, వ్యాపకాలు.. ఒకటేమిటి.? అన్నీ స్మార్ట్ మొబైల్‌తోనే అయిపోతున్నాయ్.
Also Read: Rashmika Mandanna.. కాంతారా.! నన్ను బ్యాన్ చేయగలరా.?
సో, స్మార్ట్ మొబైల్ ఫోన్ లేకుండా క్షణం కూడా గడవదు చాలామందికి. అదే ఎంటర్టైన్మెంట్.. అదే సంపాదనా మార్గం.! ముందు ముందు అదే జీవితంగా మారిపోనుందేమో కూడా.!
ఇక, జీవిత భాగస్వామి అంటారా.? స్మార్ట్ మొబైల్ ఫోన్ కంటే చక్కని భాగస్వామి ఏముంటుంది.? అనుకునేవారి సంఖ్య కూడా పెరిగిపోతోందండోయ్.! ఇది కలి కాలం కాదు.. అంతకు మించిన స్మార్ట్ మొబైల్ ‘పోయే’కాలం.!
స్మార్ట్ మొబైల్ ఫోన్.. విడాకులకు కారణమవుతోంది.. ఆత్మహత్యలకు పురిగొల్పుతోంది.! వాట్ నాట్.. స్మార్ట్ మొబైల్ ఫోన్ ఎన్ని లాభాలను తెస్తోందో.. అంతకు మించి నష్టాల్నీ మిగుల్చుతోంది.
కాపురాలు కూలిపోతున్నాయ్.. జీవితాలూ నాశనమైపోతున్నాయ్.! కానీ, స్మార్ట్ మొబైల్ ఫోన్ అంటే వాడుకున్నోడికి వాడుకున్నంత.!