Pawan Kalyan Jagan Pindakudu.. అరరె.! జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎంత మాట అనేశారు.? అదీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఉద్దేశించి అలా ఎలా అనగలిగారు.?
ఇంతకీ, వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని పవన్ కళ్యాణ్ ఏమన్నారు.? చాలా అన్నారు.! కాదు కాదు, చాలా చాలా మాటలు అన్నారు.
వాటిల్లో మచ్చుకి ఒకటి.. ‘పిండాకూడుకీ.. పిండి వంటకీ తేడా తెలియని జగన్’.! అచ్చంగా చెప్పిందేంటంటే, ‘పిండాకూడు అంటే, పిండి వంట అనుకుంటాడు’ అని.!
మరొక ఆణిముత్యం, ‘తద్దినానికీ అట్ల తద్దికీ తేడా తెలియనివాడు జగన్’ అట.!
ఇంకొకటేమో, ‘శ్రాధ్ధానికీ శ్రావణ శుక్రవారానికీ తేడా తెలియనివాడు జగన్’.. అన్నది జనసేనాని వెటకారం.!
‘అ.. కీ.. ఆ.. కీ తేడా తెలియనివాడు.. వారాహికీ.. వరాహికీ తేడా తెలియనివాడు.. ఆ మహానుభావుడు ముఖ్యమంత్రి..’ అంటూ జనసేనాని సంచలన వ్యాఖ్యలు చేశారు.
Pawan Kalyan Slams Jagan Pindakudu.. ఎవరైనా చెప్పండయ్యా..
‘పెళ్ళికి వెళ్ళు ఒకటే నవ్వు.. ఎవరైనా చచ్చిపోతే వెళ్ళు.. అదే నవ్వు.. ఏవయ్యా.. చెప్పండయ్యా ఎవరైనా అతనికి.. అలా నవ్వకూడదయ్యా బాబూ.. సరే, పుట్టుకతో వచ్చిన బుద్ధులు.. పిడకలతో పోతాయని అంటారు..’ అని సెలవిచ్చారు పవన్ కళ్యాణ్.
రాజకీయాల్లో విమర్శలు సహజం. కానీ, అవిప్పుడు శృతిమించుతున్నాయ్.! ఒక చెంప మీద కొడితే, ఇంకో చెంప చూపించే రోజులు కావివి.
తమలపాకుతో నువ్వొకటిస్తే.. తలుపు చెక్కతో నేనొకటిస్తా.. అనే పరిస్థితులున్నాయ్. ముఖ్యమంత్రి పదే పదే పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతున్నప్పుడు.. పవన్ కళ్యాణ్ నుంచి కౌంటర్ ఎటాక్స్ ఇలా వుండడంలో వింతేముంది.?