బిగ్‌ పాలిటిక్స్‌: శ్రీముఖికి ఎదురే లేదా.?

 బిగ్‌ పాలిటిక్స్‌: శ్రీముఖికి ఎదురే లేదా.?

బిగ్‌ హోస్ట్‌ (Bigg Boss 3 Telugu) నాగార్జున (Akkineni Nagarjuna) నుంచి ఫుల్‌ సపోర్ట్‌.. కంటెస్టెంట్స్‌ నుంచి కూడా అదే తరహా సపోర్ట్‌ని రాబట్టుకోగల నైపుణ్యం.. ఇవన్నీ వుండగా, బిగ్‌ హౌస్‌ నుంచి శ్రీముఖిని ఎలిమినేట్‌ చేసే సత్తా ఎవరికైనా వుందా.? టాప్‌ 5 లిస్ట్‌లోనే కాదు, ఆ మాటకొస్తే టైటిల్‌ విన్నర్‌ రేసులోనూ శ్రీముఖిని (Sree Mukhi Bigg Winner) ఢీకొనేంత సీన్‌ దాదాపుగా ఇంకెవరికీ లేదంటూ జరుగుతున్న ప్రచారంలో నిజమెంత.?

ఇందులో ఆశ్చర్యపోవడానికేమీ లేదు. శ్రీముకికి అన్నీ అలా కలిసొచ్చేస్తున్నాయి. రాహుల్‌ సిప్లిగంజ్‌తో (Rahul Sipligunj) వున్న ఆ కాస్త ‘వైరం’ కూడా దాదాపుగా చల్లారిపోయినట్లే. లేటెస్ట్‌ ఎపిసోడ్‌లో ఈ విషయాన్ని శ్రీముఖి స్వయంగా వెల్లడించింది. స్ట్రాంగ్‌ కంటెస్టెంట్స్‌ని తనదైన వ్యూహాలతో బోల్తా కొట్టించగలదు శ్రీముఖి. ఈ క్రమంలో ఎవర్నయినాసరే, శ్రీముఖి చాలా తేలిగ్గా బ్యాడ్‌ చేసెయ్యగలదు.

Click Here: బిగ్‌ స్కెచ్‌.. శ్రీముఖి గ్లామర్‌ బీభత్సం.!

శ్రీముఖి ఏం చేసినాసరే, బిగ్‌ హోస్ట్‌ నాగార్జున నుంచి ఆమెకు పాజిటివ్‌ వైబ్స్‌ మాత్రమే కనిపిస్తున్నాయి. మంచి ఎంటర్‌టైనర్‌ కావడం శ్రీముఖికి అదో బిగ్‌ ప్లస్‌ పాయింగ్‌. హౌస్‌లో బిగ్గరగా అరవడం విషయంలో శ్రీముఖి మీద కొంత నెగెటివ్‌ ‘కంప్లయింట్స్‌’ వున్నా, అవి ఆమెకి మైనస్‌లా కాకుండా, అప్పుడప్పుడూ ప్లస్‌ అయిపోతుంటాయి.

గత కొద్ది రోజులుగా శ్రీముఖి బిగ్‌ హౌస్‌లో అందాల ‘రాక్షసి’ అన్నట్లుగా కన్పిస్తోంది. ఆమెలో కన్నింగ్‌ మెంటాలిటీ బయటపడిపోతున్నా, ఆమె పట్ల పెద్దగా వ్యతిరేకత కన్పించకపోవడం ఆశ్చర్యకరం. ఇదేదో ప్రీ ప్లాన్‌డ్‌ వ్యవహారంలా వుందన్న చర్చ బిగ్‌ హౌస్‌ గురించి చాలా గట్టిగా జరుగుతోంది. ఆ చర్చ సంగతేమోగానీ, బిగ్‌ హౌస్‌లో ప్రతి ఒక్కర్నీ తన మాటలతో మాయ చేయగలుగుతోంది శ్రీముఖి.

అలీ రెజా – బాబా భాస్కర్‌ (Ali Reza Baba Bhaskar) ఎపిసోడ్‌లో శ్రీముఖి చాలా తెలివిగా వ్యవహరించింది. బాబా భాస్కర్‌ని ఓదార్చుతున్నట్లే కన్పిస్తూ.. తనదైన గేమ్‌ ప్లాన్‌ని అమలు చేసింది. ఎక్కడ ఎలా వ్యవహరించాలో బహుశా బిగ్‌ హౌస్‌లో శ్రీముఖికి తెలిసినంతగా ఇంకెవరికీ తెలియదేమో.

Click Here: శ్రీముఖి.. ‘బిగ్‌బాస్‌-3’ జేజెమ్మ.!

ఇక లేటెస్ట్‌ వీకెండ్‌లో బిగ్‌ హోస్ట్‌ నాగార్జున, కంటెస్టెంట్స్‌ మధ్య చిచ్చు పెట్టాడా.? అంటే అవుననే అన్పిస్తోంది. మిత్రుడు, శతృవు, వెన్నుపోటుదారుడంటూ.. మూడు కాలమ్స్‌లో మూడు ఫొటోలు పెట్టాలనే టాస్క్‌ కంటెస్టెంట్స్‌కి ఇచ్చాడు నాగార్జున. అంతే, ఒక్కొక్కరూ తమ విశ్వరూపం చూపించేశారు. పునర్నవి భూపాలం అయితే వితిక షెరు, వరుణ్‌ సందేశ్‌లపై నెగెటివిటీని ప్రదర్శించింది.

అషు రెడ్డి – హిమజ (Ashu Reddy Himaja) మధ్య కూడా మాటలు ఎక్స్‌ఛేంజ్‌ అయ్యాయి. మిగతా హౌస్‌మేట్స్‌లో ఒకరిద్దరు తప్పితే పెద్దగా ఎవరూ నెగెటివిటీ చూపించలేదు. దాంతో, ఈ టాస్క్‌ పునర్నవిని ఏకాకిని చేయడమే అన్న భావన కలుగుతోంది. అయితే ఇది బిగ్‌బాస్‌ టాస్క్‌. నాగార్జున మాత్రం ఏం చేయగలడు.? కానీ, నాగ్‌ మీద సహజంగానే నెగెటివిటీ క్రియేట్‌ అయిపోతుండడం గమనార్హం.

Digiqole Ad

Related post

Leave a Reply