Rashmika Mandanna VNR TRIO.. నితిన్‌కి రష్మిక హ్యాండిచ్చేసిందట. మీరు విన్నది నిజమే. నితిన్ కొత్త ప్రాజెక్ట్ నుంచి రష్మిక మండన్నా తప్పుకుందట.
నితిన్ – రష్మిక కాంబినేషన్లో గతంలో ‘భీష్మ’ సినిమా వచ్చింది. మంచి విజయం అందుకుంది. వెంకీ కుడుముల ఈ సినిమాకి దర్శకుడు.
ఇప్పుడు ఇదే కాంబినేషన్లో కొత్త ప్రాజెక్ట్ సెట్ చేశారు. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ సెట్స్ మీదికి వెళ్లాల్సి వుంది.
Rashmika Mandanna VNR TRIO.. మొన్న పూజా హెగ్ధే, నేడు రష్మిక..
లేటెస్ట్గా అందుతోన్న సమాచారం ప్రకారం, ఈ ప్రాజెక్ట్ నుంచి రష్మిక తప్పుకున్నట్లు తెలుస్తోంది. రష్మిక ప్రస్తుతం తెలుగుతో పాటూ, హిందీలోనూ బిజీ అయిపోయింది.

బాలీవుడ్ ప్రాజెక్టులతో బిజీ షెడ్యూల్స్ కారణంగానే మొన్న పూజా హెగ్ధే కూడా తెలుగులో ‘గుంటూరు కారం’ సినిమా నుంచి తప్పుకుంది. ఇప్పుడు రష్మిక.
రష్మిక ప్రస్తుతం హిందీలో పలు క్రేజీ ప్రాజెక్టులకు సైన్ చేసింది. అలాగే, తెలుగులోనూ ‘పుష్ప 2’ రష్మికకు ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ అనే చెప్పాలి.
దీంతో పాటూ ‘రెయిన్బో’ అనే హీరోయిన్ సెంట్రిక్ మూవీలోనూ రష్మిక నటిస్తోంది. సో, డేట్స్ అడ్జస్ట్ చేయలేకే నితిన్ సినిమాకి హ్యాండిచ్చిందని అంటున్నారు.
సెంటిమెంట్‌ని బ్రేక్ చేసేసిందే.?
వెంకీ కుడుముల దర్శకత్వంలో వచ్చిన ‘ఛలో’ సినిమాతో రష్మిక మండన్నా తెలుగు తెరకు పరిచయమైంది. ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది.

రష్మికకూ మంచి పేరొచ్చింది. అదే సెంటిమెంట్‌తో వెంకీ కుడుముల ‘భీష్మ’ సినిమాకీ రష్మికనే హీరోయిన్గా తీసుకున్నాడు.
Also Read: Pawan Kalyan: చరణ్, ఎన్టీయార్ గ్లోబల్ స్టార్స్.! నేను కాదు.!
ఆ సినిమా కూడా మంచి కమర్షియల్ హిట్ అందుకుంది. కరోనా టైమ్‌లో నితిన్‌కీ సూపర్ హిట్ ఇచ్చిందీ సినిమా. హిట్ కాంబో కావడంతో, మూడోసారీ ఈ కాంబినేషన్ రిపీట్ చేయాలనుకున్నాడు వెంకీ.
అనూహ్యంగా రష్మిక ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుందంటూ ప్రచారం జరుగుతోంది. చూడాలి మరి, నిజంగానే రష్మిక ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుందా.? లేక ఇదంతా వుత్త ప్రచారమేనా.? తెలియాల్సి వుంది.