Ketika Sharma Bro.. ‘రొమాంటిక్’ అంటూ తెలుగు తెరకు పరిచయమైంది బొద్దుగుమ్మ కేతిక శర్మ. తొలి తెలుగు సినిమాతో ఫ్లాప్ చవిచూసినా, కేతికకి అవకాశాలైతే బాగానే వస్తున్నాయ్.!
మీకు తెలుసా.? కేతిక శర్మ (Ketika Sharma) మంచి స్విమ్మర్ అని. స్విమ్మింగ్ నేపథ్యంలో సినిమా తెరకెక్కితే, అందులో చాన్స్ వదులుకోనని అంటోంది కేతిక శర్మ.
అంతే కాదు, బయోపిక్స్‌లో నటించడం, చారిత్రక నేపథ్యమున్న సినిమాల్లో నటించడం కూడా కేతిక శర్మకి (Ketika Sharma) ఇష్టమట.
Ketika Sharma Bro ‘బ్రో’లో ఛాన్స్ అలా..
‘రంగ రంగ వైభవంగా’ సినిమాలో నటిస్తున్నప్పుడే, ‘బ్రో’ (Bro The Avatar) సినిమాలో ఛాన్స్ వచ్చిందని కేతిక శర్మ తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పింది.
సాయి ధరమ్ తేజ్ అందరితోనూ త్వరగా కలిసిపోతారనీ, వైష్ణవ్ తేజ్ మాత్రం.. కలిసిపోవడానికి కొంత సమయం తీసుకుంటాడని.. ‘పంజా’ బ్రదర్స్ గురించి చెప్పుకొచ్చింది కేతిక.
కేవలం పవన్ కళ్యాణ్ (Power Star Pawan Kalyan) కోసమే ‘బ్రో’ (Bro The Avatar) సినిమాని ఒప్పుకున్నానని కేతిక శర్మ చెబుతోంది.
జస్ట్ ఐదు నిమిషాలే..
‘బ్రో’ సినిమాలో పవన్ కళ్యాణ్‌తో స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం రాలేదట. సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej) తనని, పవన్ కళ్యాణ్‌కి పరిచయం చేశాడంటూ కేతిక శర్మ వెల్లడించింది.
Also Read: Iswarya Menon.! చూడగానే ప్రేమలో పడిపోయా.!
‘పవన్ కళ్యాణ్‌గారితో (Pawan Kalyan) మాట్లాడింది జస్ట్ ఐదు నిమిషాలే. కానీ, ఆ ఐదు నిమిషాలు నా జీవితంలో చాలా చాలా ప్రత్యేకం..’ అంటూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది కేతిక.

తన స్నేహితుల్ని తాను ‘బ్రో’ (Bro The Avatar) అనే పిలుస్తాననీ, తనకు ఓ సోదరుడు వున్నాడనీ, అతడు ఆస్ట్రేలియాలో వుంటాడని కేతిక పేర్కొంది.
‘ఆహా స్టూడియోస్’ ప్రాజెక్ట్ ఒకటి చేస్తోందిట కేతిక శర్మ (Ketika Sharma). ఆ ప్రాజెక్ట్ వివరాలు ప్రస్తుతానికి సస్పెన్స్ అంటోంది ఈ బొద్దుగుమ్మ.!