Sreeleela.. నమ్మాల్సిందే! బాలయ్యతో చాలా కొత్తగా వుంటుదట!

Sreeleela Balakrishna NBK108
Sreeleela Balakrishna NBK108.. చాలా చాలా కొత్తగా వుంటుందట.! నందమూరి బాలకృష్ణతో సినిమా విషయమై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది స్టన్నింగ్ బ్యూటీ శ్రీలీల.
పదహారణాల తెలుగమ్మాయ్ అయినాగానీ, తొలుత కన్నడ సినిమాలతోనే తెరంగేట్రం చేసి, ‘పెళ్ళి పందడి’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది శ్రీలీల.
మాస్ మహరాజ్ రవితేజతో ‘ధమాకా’ సినిమాలో నటించి బంపర్ హిట్ కొట్టిన శ్రీలీల, ఇప్పుడు ఏకంగా నందమూరి బాలకృష్ణ సినిమాలో ఛాన్స్ దక్కించుకుంది.
Sreeleela Balakrishna NBK108.. సెట్స్‌లోకి అడుగు పెట్టేశా..
తాజాగా శ్రీలీల, బాలకృష్ణతో కలిసి సెట్స్‌లో సందడి చేసింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతోందీ సినిమా. ప్రస్తుతానికైతే టాలీవుడ్‌లో మోస్ట్ హ్యాపెనింగ్ బ్యూటీగా శ్రీలీల పేరు మార్మోగిపోతున్న సంగతి తెలిసిందే.
దాదాపు డజను ప్రాజెక్టులతో క్షణం తీరిక లేకుండా వుంది శ్రీలీల. ఓ కొత్త సినిమా స్టార్ట్ అవుతున్నా.. అందులో శ్రీలీల హీరోయిన్.. అనే గాసిప్స్ పుట్టుకొస్తున్నాయ్.
చాలా చాలా కొత్తగా..
‘నన్ను నమ్మండి.. ఈ సినిమాలో నా రోల్ చాలా కొత్తగా వుంటుంది..’ అంటూ ట్వీటేసింది శ్రీలీల, బాలకృష్ణతో కలిసి సినిమా చేయనుండడంపై.
బాలయ్యతో సినిమా అంటే మామూలుగా వుండదు మరి.! పైగా, అనిల్ రావిపూడి దర్శకత్వం. ‘అఖండ’, ‘వీర సింహారెడ్డి’ సినిమాల సక్సెస్‌తో మంచి ఊపు మీదున్న బాలయ్య, ఈ సినిమాతో హ్యాట్రిక్ హిట్ కొట్టేందుకు సిద్ధంగా వున్నాడు.
