NRI Rice Bags America.. అరరె.! అమెరికాలో ‘రైస్ బ్యాగ్స్’ కొరత ఏర్పడిందే.!
అబ్బే, నిజానికి కొరత ఏమీ లేదు. కాకపోతే, భారత ప్రభుత్వం, ‘బియ్యం ఎగుమతుల’కు సంబంధించి ఆంక్షలు విధించడంతో ఒక్కసారిగా అక్కడి భారతీయులు ఖంగుతిన్నారు.
కోవిడ్ వ్యాక్సిన్ కోసం ‘క్యూ’ లైన్లలో నిలబడినట్లు, రైస్ బ్యాగ్స్ దొరికే స్టోర్స్ వద్ద భారీగా ‘క్యూ’లలో నిల్చున్నారు.!
డిమాండ్‌ని బట్టి రేట్లు మారిపోయాయ్.! రాత్రికి రాత్రి రైస్ బ్యాగ్స్ ధరలు డబుల్.. అంతకంటే ఎక్కువకు పెరిగిపోయాయ్.
NRI Rice Bags America.. ఎందుకింత భయం.?
దాంతో ‘రైస్’ వినియోగదారులు అవాక్కయ్యారు. బియ్యాన్ని నార్త్ ఇండియన్స్ తక్కువగా వాడతారు. సౌత్ ఇండియన్స్ ఎక్కువగా వాడతారు.
అందునా, తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎన్నారైల సంగతి సరే సరి.! అత్యధికంగా రైస్ బ్యాగ్స్ వినియోగించేది అమెరికాలో, తెలుగు రాష్ట్రాలకు చెందినవారే.
అందునా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారు ఇంకాస్త ఎక్కువగా రైస్ వినియోగిస్తారు. వాస్తవానికి, అమెరికా వెళ్ళాక అక్కడి ఆహారపుటలవాట్లకు మనోళ్ళూ అలవాటుపడిపోవాల్సిందే.
కానీ, కొందరుంటారు.. పెరుగన్నం.. ఆవకాయ్.. ఇది లేకపోతే ముద్ద దిగదు.
ఇక్కడ టమాటా.. అక్కడ రైస్ బ్యాగ్స్.!
ఏదన్నా దొరకదేమో అన్న భయం వచ్చినప్పుడు.. ఇదిగో ఇలా ‘రైస్ బ్యాగ్స్’ కోసం ఎగబడినట్లే వుంటుంది పరిస్థితి.
చూస్తున్నాం కదా.. మన దేశంలో టమాటా ధరలు పెరగ్గానే, వాటి కోసం జనం ఎగబడుతున్న తీరు. అమెరికా వెళితేనేం.. మనోళ్ళ బుద్ధి మారుతుందా.?
కామెడీ ఏంటంటే.. కొన్ని రియల్ ఎస్టేట్ సంస్థలు, ‘ఇల్లు కొంటారా.? రైస్ బ్యాగ్స్ ఉచితం..’ అంటున్నాయ్.! ఇలా తగలడింది బియ్యం యాపారం.. అమెరికాలో.!