Bigg Boss Telugu Censor.. బిగ్ బాస్ రియాల్టీ షో తెలుగు సీజన్ సెవెన్ త్వరలో ప్రారంభం కాబోతోంది.
కొత్త సీజన్ ప్రారంభానికి ముందు, న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది బిగ్ బాస్ రియల్టీ షో తీరుతెన్నులపై.
ఉన్నత న్యాయస్థానం (హైకోర్టు) చేసిన వ్యాఖ్యలు అందర్నీ ఆలోచనలో పడేస్తున్నాయ్.!
రియాల్టీ షో ప్రసారానికి ముందు అభ్యంతరాలకు అవకాశం లేదనీ, ప్రసారమయ్యాక అభ్యంతరాలుంటే ఫిర్యాదు చేసుకోవచ్చని నిర్వాహకులు కోర్టుకు విన్నవించారు.
Bigg Boss Telugu Censor.. ఇంత బాధ్యతారాహిత్యమా.?
ఇది ఒకరకంగా చూస్తే, అత్యంత నిర్లక్ష్యపూరితమైన సమాధానం.! సినిమాలకి సెన్సార్ వుంటుంది. రియాల్టీ షోలకు సెన్సార్ లేకపోతే ఎలా.?
అయినా, సెన్సార్ వుంటే.. అది రియాల్టీ షో ఎలా అవుతుంది.? అన్నదీ ఆలోచించాల్సిన విషయమే.!
ఒక్కటి మాత్రం నిజం.. బిగ్ బాస్ రియాల్టీ షో హద్దులు దాటుతోంది. ఇతర భాషల్లో సంగతెలా వున్నా, తెలుగులో పరిస్థితి మరీ చెయ్యి దాటుతోంది.
అత్యంత అభ్యంతకరమైన రీతిలో బూతులు.. అడ్డగోలు ప్రేమలు.. ఇదంతా చూడాల్సి వస్తోంది బిగ్ బాస్ రియాల్టీ షోలో.
రిమోట్ చేతిలో వుందిగా..
రిమోట్ చేతిలో వుంటుంది గనుక, నచ్చకపోతే ఛానెల్ మార్చెయ్యొచ్చంటూ సదరు ఛానల్ నిర్వాహకులు బుకాయించొచ్చుగాక.!
సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునేలా సన్నివేశాలు నడుస్తోంటే, నైతికత అనేది వర్తించదా.?
Also Read: ‘భోళా శంకర్’.! చిరంజీవి ‘మెగా’ టైమింగు.!
కేంద్రం కొత్త చట్టాలు చేసేదెప్పుడు.? ఇలాంటి గలీజు షోలపై సెన్సార్ విధించేదెప్పుడు.? అన్న చర్చ ఇప్పుడు సర్వత్రా జరుగుతోంది.
ఔను, ఇప్పుడున్న చట్టాల ప్రకారం, టెలివిజన్ షోస్‌కి ముందస్తు సెన్సార్ సాధ్యం కాదు మరి.! అలాగని, జుగుప్సని ప్రోత్సహిద్దామా.? చూసీ చూడనట్టు వదిలేద్దామా.? నిలదీద్దామా.?
ముమ్మాటికీ నిలదీయాల్సిందే.. జుగుప్సకి తెర దించాల్సిందే. కానీ, ఎలా.? అదే ఇప్పుడు మిలియన్ డాలర్ క్వశ్చన్.