Table of Contents
Ahmedabad Plane Crash.. విమానం కుప్పకూలింది.! ఔను, నిజంగానే కుప్పకూలిపోయింది. ఎగరలేక నేలకు జారింది.!
250 మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన ప్రమాదమిది. ఘోర విమాన ప్రమాదం అహ్మదాబాద్ విమానాశ్రయానికి సమీపంలో జరిగింది.
అహ్మదాబాద్ నుంచి యూకేకి బయల్దేరిన ఎయిర్ ఇండియా విమానం ప్రమాదానికి గురైందన్న వార్త, దేశ ప్రజలందరికీ షాకింగ్ న్యూస్.
Ahmedabad Plane Crash.. అలా ఎలా కూలిపోయింది.?
విమానం గాల్లోకి లేచాక, సాంకేేతిక సమస్యతో కుప్పకూలిపోయిందన్నది ప్రాథమిక సమాచారం. అయితే, విమానాశ్రయం నుంచి పైకి లేస్తూనే, ఇంకా పైకి లేవలేక.. కూలిపోయినట్లు సీసీటీవీ ఫుటేజ్‌తో స్పష్టమైంది.
నిజానికి, విమానాల నిర్వహణ విషయంలో చిన్నపాటి పొరపాట్లు కూడా లేకుండా అత్యంత జాగ్రత్తగా వ్యవహరిస్తాయి విమానయాన సంస్థలు.
విమానాల తయారీ, వాటి నిర్వహణ.. పిన్ పాయింట్‌గా వుంటుందని ఏవియేషన్ రంగ నిపుణులు చెబుతున్నారు. అలాంటప్పుడు, విమానం టేకాఫ్ అవుతూనే, ఎందుకు కూలిపోయినట్లు.?
రెండు ఇంజిన్లూ ఫెయిల్ అయ్యాయా.?
రెండు ఇంజిన్లూ ఒకేసారి ఫెయిల్ అవడం వల్ల ప్రమాదం సంభవించిందన్న వాదన వినిపిస్తోంది. అలా రెండు ఇంజిన్లూ ఒకేసారి ఫెయిల్ అవడం దాదాపు అసాధ్యమన్నది ఏవియేషన్ రంగ నిపుణులు చెబుతున్నమాట.
పక్షులు ఢీకొనడం వల్ల ప్రమాదాలు సంభవిస్తుంటాయిగానీ, ది కూడా చాలా అరుదైన విషయమే. ఎలా చూసినా, అహ్మదాబాద్ విమాన ప్రమాదం ఎలా జరిగిందన్నది ఎవరికీ అంతుబట్టడంలేదు.
Also Read: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ‘గ్రాఫ్’: గ్రౌండ్ రిపోర్ట్ ఇదీ.!
ఫ్లైట్ డేాటా రికార్డర్.. అదే బ్లాక్ బాక్స్ లభ్యమైతే, ప్రమాదానికి కారణాలు స్పష్టంగా తెలిసే అవకాశం వుంది.
అయితే, విమానం గాల్లోకి లేచిన క్షణాల్లోనే, పైలట్లు ‘మేడే’ అంటూ ఏటీసీ సిబ్బందికి చెప్పడం.. ఆ వెంటనే కమ్యూనికేషన్ కట్ అవడం.. పలు అనుమానాలకు తావిస్తోంది.
ఒకే ఒక్కడు బతికి బట్టకట్టాడు..
అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో ఒకే ఒక్కడు ప్రాణాలతో బయటపడ్డాడు. విమానంలోని సీటు ‘నెంబర్ 11ఎ’ ప్రయాణీకుడు అతడు.
పేరు విశ్వాస్ కుమార్ రమేష్. విమానం కుప్ప కూలుతున్న సమయంలో కిందికి దూకేశానని ప్రయాణీకుడు చెబుతున్నా, అదెలా సాధ్యమో ఏమో.?
ప్రమాదం తర్వాత నడుచుకుంటూనే, అంబులెన్స్ దగ్గరకి విశ్వాస్ కుమార్ రమేష్ వెళ్ళాడు. స్వల్ప గాయాల పాలైన అతనికి ఆసుపత్రిలో వైద్య చికిత్స అందిస్తున్నారు.