Secret Behind Bad Dreams.. చాలా మందికి నిద్రలో కలలు వస్తాయ్. కొన్ని కలలు అందంగా ఆహ్లాదంగా అనిపిస్తాయ్. కొన్ని కలలు భయపెట్టేస్తాయ్. వాటినే పీడకలలు, బ్యాడ్ డ్రీమ్స్ అంటుంటాం.
అందమైన కలలు వస్తే ఎలాంటి సమస్య లేదు. కానీ, పీడకలలు (Bad Dreams) వస్తే ఒకింత మనసులో గందరగోళం. అసలు కలలు ఎందుకు వస్తాయ్.?
నిద్ర సమయం మించిపోయినప్పుడు మనల్ని నిద్ర పుచ్చేందుకు మెదడు చేసే ఓ మాయా జాలమే ‘కల’. వ్యక్తిగత అనుభవాలు.. యాదృచ్చికమైన ఆలోచనలే కలలు రావడానికి కారణాలని శాస్ర్తవేత్తలు చెబుతున్నారు.
Secret Behind Bad Dreams.. కలలు రావడానికి కారణాలేంటీ.?
యాక్టివేషన్ సింథసిస్ మోడల్ ఆధారంగా మన మెదడులో జరిగే కార్యచరణను అర్ధం చేసుకోవడానికి సంకేతమే కల రూపంలో వస్తుందని స్వప్న శాస్ర్తం చెబుతోంది.
మన మెదడు, మెదడులో వుండేటటువంటి అమిగ్ధాలా, హిప్పోకాంపస్ వంటి భాగాల నుంచి సంకేతాలను గ్రహిస్తుంది. వాటిని అర్ధం చేసుకునేందుకు ప్రయత్నిస్తుంది. తత్ఫలితంగా కలలు వస్తాయి.

మన మెమరీలో స్టోర్ అయిన జ్ఞాపకాలు, అనుభవాలే మనకు కలల రూపంలో వస్తుంటాయని స్వప్న శాస్ర్త నిపుణులు చెబుతున్నారు.
పెద్ద వయసు వారిలో పీడకలలు (Bad Dreams) రావడానికి వారు వేసుకునే మందుల దుష్ప్రభావం కూడా ఓ కారణం కావచ్చు.
చిన్న పిల్లలో తరచూ పీడకలలు రావడమనేది వారి ఎదుగుదల ప్రక్రియలో ఓ సాధారణ దశగా పరిగణించొచ్చు. భయానక సంఘటనల అనుభవాలు, హారర్ సినిమాలు చూడడం, లేదా వినడం వల్ల పీడకలలు వస్తుంటాయ్.
పీడకలలు డేంజరే సుమా.?
అయితే తరచూ ఇలా జరుగుతుంటే ఏం చేయాలి.? ఏ వయసు వారిలోనైనా తరచూ పీడకలలు వస్తుంటే, వయసు పెరిగే కొద్దీ వారిలో కొన్ని దీర్ఘ కాలిక సమస్యలు తలెత్తే అవకాశాలున్నాయని ఓ సర్వే ద్వారా తేలింది.

మతి మరుపు రావడం, స్పష్టంగా ఆలోచించలేకపోవడం, సరైన నిర్ణయాలు సరైన సమయంలో తీసుకునే సామర్ధ్యం లేకపోవడం.. ఎక్కడో ఆలోచిస్తున్నట్లుగా వేరే ప్రపంచంలో వుండడంలాంటి సమస్యలు తలెత్తుతాయట.
Also Read: ఎకరం వెయ్యి కోట్లు! నువ్వు తిన్న మన్నేరా నిన్ను తిన్నదీ!
సరైన ఆహారం తీసుకోవడం, ఒత్తిడి తగ్గించుకోవడం, తగినంత నిద్రపోవడం ద్వారా పీడకలల్ని నివారించుకోవచ్చు.
అయినా, తరచూ పీడకలలు వస్తుంటే అశ్రద్ధ చేయరాదని సంబంధిత వైద్య నిపుణుల్ని సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.