Nikhil Siddhartha Swayambhu Budget.. యంగ్ హీరో నిఖిల్ ఇమేజ్ ‘కార్తికేయ-2’ సినిమాతో అనూహ్యంగా మారిపోయింది. పాన్ ఇండియా స్థాయిలో ఆ సినిమా సక్సెస్ అయ్యింది.
కానీ, ‘స్పై’ సినిమాతో మళ్ళీ బొక్కబోర్లా పడ్డాడు నిఖిల్. అయితేనేం, ఈసారి ‘స్వయంభు’ అంటూ సరికొత్తగా పాన్ ఇండియా సినిమా చేయబోతున్నాడు.
‘స్వయంభు’ (Swayambhu)సినిమా సెట్స్ మీదకు వెళ్ళింది. ‘జర్నీ బిగిన్స్’ అంటూ సినిమా మొదలైన విషయాన్ని మేకర్స్ వెల్లడించారు.
Nikhil Siddhartha Swayambhu Budget.. బెట్టింగ్.. ఏ స్థాయిలో.!
ఈ రోజుల్లో సినిమా అంటే బెట్టింగే.! పెద్ద హీరో అయినా.. చిన్న హీరో అయినా.. ఏదీ బెట్టింగుకి అతీతం కాదు.!
‘ఆదిపురుష్’ (Adi Purush) సినిమా రిజల్ట్ ఏమయ్యిందో చూశాం. ‘భోళా శంకర్’ (Bholaa Shankar) పరిస్థితి ఏంటన్నదీ చూస్తున్నాం.
‘బేబీ’ లాంటి సినిమాలు అనూహ్య విజయాన్ని అందుకోవడం స్వాగతించాల్సిన విషయమే. కానీ, పెద్ద సినిమాలు బొక్క బోర్లా పడుతుండడమే విచారకరం.
ఎన్ని కోట్లు గుమ్మరిస్తారో..
నిఖిల్ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్ సినిమా ‘స్వయంభు’.! వీఎఫ్ఎక్స్ కోసమే అనూహ్యంగా ఖర్చు చేయనున్నారట.
ఇండియన్ సినిమా స్క్రీన్‌పై ఇదొక స్పెషల్ మూవీ.. అంటోంది ‘స్వయంభు’ (Swayambhu Movie) చిత్ర బృందం. అంతే కాదు, ఇదొక వారియర్ కథ.!
చూద్దాం.. నిఖిల్ మీద ఏ స్థాయిలో ‘స్వయంభు’ కోసం ఖర్చు చేస్తారో.. ఏ స్థాయిలో సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ జరుగుతుందో.! ఏ స్థాయిలో విడుదలయ్యాక ఈ ‘స్వయంభు’ సందడి చేస్తుందో.!