Ustaad Bhagat Singh Sakshi Vaidya.. సాక్షి వైద్య గుర్తుందా.? ‘ఏజెంట్’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైందీ బ్యూటీ.!
తొలి సినిమా ఫ్లాప్ అయినా, సాక్షి వైద్యకి (Sakshi Vaidya) తెలుగులో అవకాశాలు బాగానే వస్తున్నాయ్.!
వరుణ్ తేజ్ (Varun Tej Konidela) హీరోగా నటించిన ‘గాండీవధారి అర్జున’ (Gandeevadhari Arjuna) సినిమాలోనూ సాక్షి వైద్య హీరోయిన్గా నటించింది.
ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో..
కాగా, హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ (Ustaad Bhagat Singh) సినిమాలో ఛాన్స్ కొట్టేసింది సాక్షి వైద్య.
తొలుత ఈ సినిమాలో హీరోయిన్గా పూజా హెగ్దేని (Pooja Hegde) అనుకున్నారు. ఏమయ్యిందోగానీ, సాక్షి వైద్య పేరుని ఫైనల్ చేసింది చిత్ర యూనిట్ తాజాగా.

తాను ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలో నటిస్తున్నట్లు సాక్షి వైద్య (Sakshi Vaidya) స్వయంగా వెల్లడించింది.
తమిళంలో విజయ్ హీరోగా నటించిన ‘తెరి’ సినిమాకి ఇది తెలుగు రీమేక్ అనే ప్రచారం జరుగుతోంది. విజయ్ సరసన సమంత, అమీ జాక్సన్ ఆ సినిమాలో హీరోయిన్లు.
తెలుగులో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ (Ustaad Bhagat Singh) సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ తెరకెక్కిస్తోంది.
Ustaad Bhagat Singh Sakshi Vaidya.. కాన్సెప్ట్ మాత్రమేనట..
‘తెరి’ నుంచి కాన్సెప్ట్ మాత్రమే తీసుకుని, పూర్తిగా సినిమాని తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా మార్చే పనిలో బిజీగా వున్నాడు దర్శకుడు హరీష్ శంకర్.
Also Read: స్క్రీన్ ఏజ్.! రష్మి ఇంతకీ ఏం చెప్పిందబ్బా.!
అయితే, ‘ఉస్తాద్ భగత్ సింగ్’ అసలు రీమేక్ కాదు.. పూర్తిగా ఒరిజినల్.. అనే ప్రచారమూ జరుగుతోందనుకోండి.. అది వేరే సంగతి.!

వచ్చే నెలలో.. అంటే, సెప్టెంబర్లో ఈ సినిమాకి సంబంధించి కీలక సన్నివేశాల చిత్రీకరణ జరగనుంది. సంక్రాంతికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చే అవకాశముంది.
‘ఉస్తాద్ భగత్ సింగ్’ (Ustaad Bhagat Singh) సినిమాలో మరో హీరోయిన్గా శ్రీలీల (Sreeleela) నటిస్తున్న సంగతి తెలిసిందే.