Varsha Bollamma IPL 2025.. ముద్దుగుమ్మ వర్ష బొల్లమ్మకి కోపమొచ్చింది. ట్వీటేసి, కడిగి పారేసింది.! ఇదేం పద్ధతి.? అంటూ మండిపడింది.! ఎవరిపైన? అసలు విషయమేంటి.?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ పద్ధెనిమిదవ సీజన్ నడుస్తోన్న సంగతి తెలిసిందే. వివిధ జట్లు ‘కప్’ కోసం హోరా హోరీగా పోరాడుతున్నాయి.
చెన్నయ్ సూపర్ కింగ్స్, తన సొంత గడ్డ చెన్నయ్‌లో ఓటమి చవిచూసింది.. అదీ, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు చేతిలో.
కాదు కాదు, బెంగళూరు చేతిలో చెన్నయ్ ఓడిపోయిందన్నంతగా.. రీజినల్ ఫీలింగ్ వచ్చేసింది క్రికెట్ అభిమానుల్లో. ఇండియన్ ప్రీమియర్ లీగ్ అంటేనే అంత.!
Varsha Bollamma IPL 2025.. మనోడు.. పగోడు.. ఐపీఎల్ మాయ ఇదంతా.!
కేన్ విలియమ్సన్ మనోడే.! కానీ, రోహిత్ శర్మ అంటే పగోడు అయిపోతాడు.! డేవిడ్ వార్నర్ మనోడే.! కానీ, ధోనీ అంటే చిరాకు వచ్చేస్తుంటుంది.

ఇలా ఆయా జట్ల అభిమానులు, ఇతర జట్లలోని ఆటగాళ్ళపై ‘వేరే భావన’ చూపించడం ఇటీవలి కాలంలో ఎక్కువైపోయింది. ఆటని ఆటలా చూడలేని దుస్థితి కొందరు క్రికెట్ అభిమానులది.
చెన్నయ్ ఫ్యాన్స్, విరాట్ కోహ్లీ మీద దుమ్మెత్తి పోస్తోంటే, బెంగళూరు ఫ్యాన్స్, ధోనీని తిట్టిపోస్తున్నారు. ఆ తిట్లు కాస్తా, బూతులుగా మారిపోయాయ్.!
ఓన్లీ.. మెన్ ఇన్ బ్లూ.!
ఈ క్రమంలోనే, వర్ష బొల్లమ్మ.. ఆ కొందరు క్రికెట్ అభిమానులపై గుస్సా అయ్యింది. ట్విట్టర్ వేదికగా మండిపడింది. రెడ్, ఆరెంజ్, యెల్లో.. అనే రంగులేమీ లేవంటూ క్లాస్ తీసుకుంది.
సన్ రైజర్స్ హైద్రాబాద్ టీమ్ ‘ఆరెంజ్ ఆర్మీ’గా చెలామణీ అవుతున్న సంగతి తెలిసిందే. చెన్నయ్‌ని యెల్లో ఆర్మీ.. అంటుంటారు. ఆర్సీబీని ‘రెడ్ ఆర్మీ’ అని పిలుస్తుంటారు కదా.!
Also Read: కష్టార్జితం ప్రజల కోసం.! జన సేవకై జనసేనాని.!
ఇక, అలాంటి రంగులేవీ లేవు.. వున్నదొకటే రంగు.. అదే, ‘బ్లూ.. మెన్ ఇన్ బ్లూ..’ అంటూ టీమిండియా గురించి పేర్కొంది వర్ష బొల్లమ్మ.
ఆట అన్నాక, భావోద్వేగాలు సహజమే.. ఫన్నీ బ్యాంటర్ ఓకే.. హద్దులు దాటొద్దంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చింది వర్ష. తమిళంతోపాటు తెలుగులోనూ వర్ష బొల్లమ్మ పలు సినిమాల్లో నటించిన సంగతి తెలిసిందే.