ఒకే ఒక్క ఫొటో.. అన్ని ప్రశ్నలకీ సమాధానం (Chiranjeevi Greets Allu Arjun) ఇచ్చేసింది.! అసలు సమాధానం ఇవ్వాల్సిన పని వుందా.?
లోకులు కాకులన్నది పెద్దల మాట.! ఆ కాకులే నయ్యం.! ఈ నెటిజనం అత్యంత హేయం.!
మెగాస్టార్ చిరంజీవికీ, అల్లు అర్జున్‌కీ మధ్య విభేదాలు ఎందుకుంటాయ్.? కట్టె కాలే వరకూ చిరంజీవి అభిమానినే.. అని చెబుతుంటాడు అల్లు అర్జున్.
Chiranjeevi Greets Allu Arjun.. మధ్యలో ఈ గొట్టంగాళ్ళెవరు.?
మెగాభిమానులే.. అల్లు అర్జున్ (Allu Arjun) అభిమానులు.! కొత్తగా, అల్లు అర్జున్ అభిమానులు ఎక్కడి నుంచి పుట్టుకొచ్చారు.?
నిజానికి, అల్లు అర్జున్ అభిమానులు కాదు వాళ్ళంతా. అల్లు అర్జున్ (Allu Arjun) మీద అభిమానం.. అనే ముద్ర వేసుకుని, మెగా కాంపౌండ్‌లో చిచ్చు పెడుతుంటారు.

రామ్ చరణ్‌కి మేనమామ కొడుకు అల్లు అర్జున్. అల్లు అర్జున్‌కి మేనత్త కొడుకు రామ్ చరణ్.. అలాంటప్పుడు, చరణ్ – అల్లు అర్జున్ మధ్య ఎందుకు గొడవలుంటాయ్.?
అల్లు అర్జున్‌ని అభినందించిన చిరంజీవి..
మెగాస్టార్ చిరంజీవి )Mega Star Chiranjeevi), తన సతీమణి సురేఖతో కలిసి అల్లు అర్జున్‌ని ప్రత్యేకంగా అభినందించారు. మేనత్త సురేఖ ఆశీస్సులు అలాగే, అభిమాన హీరో చిరంజీవి ఆశీస్సుల్ని అల్లు అర్జున్ అందుకున్నాడు.
ఈ ఒక్క ఫొటో.. నిజానికి, అన్ని వివాదాలకూ ఫుల్ స్టాప్ పెట్టేయాలి. అసలంటూ లేని వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టడమేంటి.?
అంతే కదా.! సోకాల్డ్ ‘అల్లు అర్జున్’ ముసుగేసుకున్న దురభిమానులకి, ఈ ఫొటో సరిపోదు.! వాళ్ళను సంతృప్తి పర్చాల్సిన అవసరం చిరంజీవికీ, అల్లు అర్జున్‌కీ, రామ్ చరణ్‌కీ.. ఇంకెవరికీ వుండదు కూడా.!
Also Read: హవ్వ.! అకీరా నందన్‌పై అప్పుడే విమర్శలా.?
తల్లికీ, చెల్లికీ మధ్యన తంపులు పెట్టేటోళ్ళు.. అన్నదమ్ముల్ని విడదీయాలని చూసేవాళ్ళు.. ఒకప్పుడు ఎక్కడెక్కడో వుండేవాళ్ళు.
ఇప్పుడు అలాంటోళ్ళంతా ’అభిమానం‘ ముసుగేసుకుని, నెటిజన్ల రూపంలో.. సోషల్ మీడియాలో అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తిస్తున్నారు.
సోషల్ మీడియా అంటే, ఇదిగో.. ఇలాంటి ఛండాలం కోసమే.. అన్నట్లు వ్యవహరిస్తున్నవారికి ఎప్పటికైనా ’బుద్ధి‘ వస్తుందని అనుకోవడం అత్యాశే అవుతుంది.!