Home » గిన్నీస్ రికార్డ్స్‌లో ‘మెగా’ డాన్స్! ఎర్నలిస్టుల ‘ఎక్స్‌క్లూజివ్’ కక్కుర్తి!

గిన్నీస్ రికార్డ్స్‌లో ‘మెగా’ డాన్స్! ఎర్నలిస్టుల ‘ఎక్స్‌క్లూజివ్’ కక్కుర్తి!

by hellomudra
0 comments
Megastar Chiranjeevi

Megastar Chiranjeevi Guinness Record.. ఊళ్ళో పెళ్ళికి కుక్కల హడావిడి.. అన్నమాట, బహుశా కొందరు ఎర్నలిస్టుల కోసమే పుట్టిందేమో.!

ఓ వార్తని అందరికన్నా ముందు తామే ‘బ్రేక్’ చేశామని చెప్పుకోవడానికి సదరు ఎర్నలిస్టులు పడే పాట్లు అన్నీ ఇన్నీ కావు మరి.!

మెగాస్టార్ చిరంజీవికి డాన్సుల పరంగా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కింది.! ఇది అరుదైన గౌరవం.

నిజానికి, గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ఎంతో అదృష్టం చేసుకుందని చెప్పాలేమో.. మెగాస్టార్ చిరంజీవి పేరుని తనలో నిక్షిప్తం చేసుకుంది మరి.!

సరే, ఆ సంగతి పక్కన పెడితే, మెగాస్టార్ చిరంజీవికి దక్కిన ఈ అరుదైన గౌరవానికి సంబంధించిన న్యూస్‌ని ఎవరో సోషల్ మీడియా వేదికగా బ్రేక్ చేశారు.

అంతకు ముందు, ఈ విషయం సినీ పరిశ్రమ అంతటా పాకేసింది.! కొందరు ‘ఎక్స్‌క్లూజివ్’ అని పేర్కొన్నారు.!

అంతే, ఓ ఎర్నలిస్టుకి ఒళ్ళు మండిపోయింది. ‘నేను ముందు బ్రేక్ చేస్తే, ఆ తర్వాత దాని గురించి చెబుతూ ఎక్స్‌క్లూజివ్ అని ఎలా అంటారు.?’ అని గుస్సా అయ్యాడు.

దీన్నే మరి, ఊళ్ళో పెళ్ళికి కుక్కల హడావిడి అనేది.! ముందు బ్రేక్ చేసినోడికి కొమ్ములేమైనా వుంటాయా.? పేటెంట్ రైట్స్ ఏమైనా వుంటాయా.?

గత కొన్నాళ్ళుగా ఈ ‘ఎక్స్‌క్లూజివ్’ పైత్యం బాగా పెరిగిపోయింది.! చాదస్తం వల్లనో, అభద్రతాభావం వల్లనో, ‘ఎక్స్‌క్లూజివ్’ పేటెంట్ రైట్స్, వార్తల కోసం అడుక్కుంటున్నార్నది నిర్వివాదాంశం.

కాగా, 150కి పైగా సినిమాల్లో.. 500కి పైగా పాటల్లో.. వేలాది డాన్స్ మూమెంట్స్‌ని మెగాస్టార్ చిరంజీవి అలవోకగా చేసేశారు.

ఏదో అలవోకగా.. అని రాసేస్తున్నాంగానీ, ఆ డాన్స్ మూమెంట్స్ చేసే క్రమంలో చిరంజీవి సాధన, చిరంజీవి పడ్డ కష్టం.. అమోఘం, అత్యద్భుతం.!

నిజానికి, రికార్డు అన్నది చిరంజీవి కష్టం ముందు చాలా చిన్న విషయం.! ఏ పురస్కారానికైనా ఆయనే అదనపు గౌరవాన్ని తీసుకొస్తారు. అదే, ఆయన ప్రత్యేకత.!

అవార్డులైనా, రికార్డులైనా మెగాస్టార్ చిరంజీవిని చూసి ఉప్పొంగిపోతాయ్.! దటీజ్ మెగాస్టార్ చిరంజీవి.

You may also like

Welcome to Mudra369, your one-stop destination for stories that matter, trends that inspire, and updates that keep you ahead. At Mudra369, we believe in delivering content that informs, entertains, and empowers.

Edtior's Picks

Latest Articles

Website Hosting Sponser

Fully Managed WordPress Hosting

© 2020-25, Mudra369 – All rights reserved. Designed By: KiTek Group