Table of Contents
Sugar Tea Or jaggery.. సాధారణంగా ‘టీ అంటే, అందులో షుగర్ (పంచదార) తప్పనిసరి.! షుగర్ పేషెంట్లు, ఆ ‘పంచదార’ లేకుండానే, ‘టీ’ తాగుతుంటారు.!
కొందరైతే, ‘బెల్లం టీ’ని ఆశ్రయిస్తుంటారు.! మధుమేహం వున్నా, లేకపోయినా.. కొంతమందికి ‘బెల్లం టీ’ అలవాటే.!
ఈ మధ్యన, మీరు మధుమేహంతో బాధపడుతున్నారా.? పంచదారకి బదులు బెల్లంతో తయారు చేసిన ‘టీ’ తాగండంటూ ప్రచారం జోరుగా సాగుతోంది.
Sugar Tea Or jaggery.. ఏదైనా నాణ్యతే కీలకం.!
అంతేనా.? ‘బెల్లంతో చేసిన టీ’ వల్ల ప్రయోజనాలు చాలా వున్నాయంటూ, పెద్దయెత్తున ప్రచారమూ జరుగుతోంది.
ఇంతకీ, ‘బెల్లంతో చేసిన టీ’ వల్ల కలిగే ప్రయోజనాలేంటి.? దుష్పరిణామాలు ఏంటి.? అన్నదానిపై మళ్ళీ భిన్న వాదనలున్నాయి.

పంచదారతో చేసిన టీ అయినా, బెల్లంతో చేసిన టీ అయినా.. నాణ్యత ముఖ్యమిక్కడ.! బెల్లం టీ పేరుతో, మార్కెట్‌లో జరుగుతున్నదంతా మంచేనని ఎలా అనుకోగలం.?
పంచదారతో పోల్చితే..
పంచదారతో పోల్చితే, బెల్లం కాస్త బెటర్.. మధుమేహులకు. ఈ విషయంలో ఇంకో మాటకు తావు లేదు.
కానీ, బెల్లం తయారీలో ఉపయోగిస్తున్న అనేకానేక కెమికల్స్.. ‘మంచి బెల్లం’తో కలిగే ప్రయోజనాలకు భిన్నంగా, సమస్యల్ని తెచ్చి పెడతాయ్.!

‘బెల్లం టీ’ తాగండి.. ఆరోగ్యంగా వుండండి.! బెల్లం టీ తాగడం వల్ల పొట్ట తగుతుంది.! అబ్బో, చెప్పుకుంటూ పోతే, చాలానే కథలు వినిపిస్తున్నాయ్.. వినిపిస్తూనే వుంటాయ్.!
ఏది మంచిది.? ఏది చెడ్డది.? అన్నదానిపై కాస్త శ్రద్ధ పెట్టి, ఒకింత నాణ్యమైన వస్తువుల్ని సమకూర్చుకుని, ఇంట్లోనే తయారు చేసుకుంటే మంచిది.!
పంచదార తగ్గిస్తేనే..
దైనందిన జీవనంలో ‘పంచదార’ వాడకం తగ్గించడమే మేలు.! డయాబెటిస్ వ్యాధిగ్రస్తులైతే, పంచదారకి దూరంగా వుండాల్సిందే కదా.!
అలాంటివారికి, పంచదార స్థానంలో బెల్లం వాడకం అనేది ఓ చిన్న వెసులుబాటు మాత్రమే. అలాగని, అది రికమండ్ చేయదగ్గది కాదు.
Also Read: జీవితకాలం ముగిశాక న్యూక్లియర్ సబ్‌మెరైన్లను ఏం చేస్తారంటే.?
డయాబెటిస్‌తో సంబంధం లేకుండా.. ఎవరైనాగానీ.. నాణ్యమైన బెల్లం.. విషయంలో రాజీపడకూడదు.! రాజీపడితే, ఆరోగ్యం హుళక్కే.

టీ మోతాదు ఓ చిన్న గ్లాస్ మాత్రమే అయితే, టీ.. అనేది కొందరికి వ్యసనం కాబట్టి.. బెల్లం టీ కాస్త బెటర్.!
టీ చేసేటప్పుడు.. బెల్లంతో చేసినా, షుగర్ వాడినా.. వాటితోపాటు కొంచెం అల్లం, వీలైతే రెండు మిరియాలు.. ఇలాంటివి వేస్తే.. కాస్త మంచిది సుమీ.!
