అమ్మ.. అద్భుతం.. బ్రెస్ట్ ఫీడింగ్..

550 0

బ్రెస్ట్‌ ఫీడింగ్ (Breast Feeding) గురించి సమీరా రెడ్డి (Sameera Reddy) మాట్లాడితే నేరమా.? ఓ తల్లి తన బిడ్డకి పాలిస్తున్న ఫోటో ప్రచారంలోకి (Breast Feeding Awareness) వస్తే పాపమా.? తల్లి పాలపై అవగాహన కోసం ఓ నటి తన న్యూడ్‌ బ్రెస్ట్‌ని బిడ్డతో సహా ఓ పత్రిక కవర్‌ పేజ్‌పై చూపిస్తే జుగుప్సాకరమా.? ‘తల్లి పాలు అమృత జాలు’ అంటారు. ఆ తల్లి పాలకున్న ఆవశ్యకత అలాంటిది.

బిడ్డకు తొలిసారిగా నేచురల్‌ ఇమ్యూనిటీ లభించేది తల్లి పాల నుండే. వాటినే ముర్రు పాలు అంటారు. పుట్టిన వెంటనే ఆ పాలు బిడ్డతో తాగించాల్సి వుంటుంది. మొదటి ఆరునెలలు తప్పనిసరిగా తల్లి పాలు ఇవ్వడం ద్వారా బిడ్డలకే కాదు, తల్లికీ మంచిది. కానీ, మారిన పరిస్థితుల నేపథ్యంగా తమ బిడ్డలకు పాలిచ్చి, పెంచే తల్లులే కరువయ్యారు. ఒకప్పుడు ఏళ్ల తరబడి పాలిచ్చే తల్లులున్నారు.

కానీ, ఇప్పుడు పాలు ఇస్తే (Mother Milk), అందం చెడిపోతుందనే నెపంతో, పుట్టిన రోజే బిడ్డని తల్లి పాలకు దూరం చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల ఇటు తల్లికీ, బిడ్డకీ ఇద్దరికీ నష్టం వాటిల్లుతోంది. అనేక రకాల అనారోగ్యాల బారిన పడుతున్నారు. ఉత్పత్తి అయిన పాలకు అడ్డు కట్ట వేయడం వల్ల ఆ తల్లులు బ్రెస్ట్‌ క్యాన్సర్‌ తదితర రోగాల బారిన పడుతున్నారు.

ఇక తల్లి పాలు తాగని పిల్లలకు అందాల్సిన ఇమ్యూనిటీ అందకుండా పోతోంది. అయితే, ఇప్పుడిప్పుడే తల్లి పాల ఆవశ్యకతను గుర్తిస్తున్నారు. ఆ క్రమంలో పలు రకాల అవేర్‌నెస్‌ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సో అలా ఎంతో కొంత తల్లి పాల ఆవశ్యకత తెలుస్తోందనుకోవాలి.
పాల కుండలు పబ్లిసిటీ కోసం కాదు.

సెలబ్రిటీ తల్లులకు హేట్సాఫ్..

సెలబ్రిటీలు బ్రెస్ట్‌ని ఎక్స్‌పోజ్‌ చేయడమనేది వారి వృత్తిలో ఓ భాగం. బ్రెస్ట్‌ని కేవలం ఓ గ్లామర్‌ కంటెంట్‌గా మాత్రమే వారు చూస్తుంటారు.. అనే విమర్శలున్నాయి. ఈ విమర్శల్లో వాస్తవమెంత.? అనే విషయం పక్కన పెడితే, మహిళకు బ్రెస్ట్‌ అనేది కాళ్లు, చేతులు, ముఖం మాదిరిగానే శరీరంలో ఓ అంతర్భాగం.

ఇదే విషయాన్ని దీపికా పదుకొనె ఓ సందర్భంలో ప్రస్థావిస్తూ, ‘బ్రెస్ట్‌ కలిగి ఉన్నందుకు నేనెంతో గర్వపడుతున్నా..’ అని సీరియస్‌గా స్పందించింది. ఈ సందర్భంలో అసలు ఇష్యూ వేరే అనుకోండి. ఇదే విషయమై కరీనా కపూర్‌ (Kareena Kapoor), ఐశ్వర్యా రాయ్‌ (Aishwarya Rai) తదితర స్టార్‌ సెలబ్రిటీలు కూడా తమదైన శైలిలో అభిప్రాయాల్ని పంచుకున్నారు.

అయితే, అందాల భామలందరూ తమ బ్రెస్ట్‌ని కేవలం ఎక్స్‌పోజింగ్‌ కోసమే వాడారా.? అంటే ఖచ్చితంగా కాదనే చెప్పాలి. ఓ మలయాళ నటి గిలూ జోసెఫ్‌ (Gilu Joseph) న్యూడ్‌ బ్రెస్ట్‌తో తల్లుల్లో అవేర్‌నెస్‌ పెంచింది. తల్లి పాల ఆవశ్యకతను చాటి చెప్పింది. అలాగే మరో నటి, తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలు అయిన కస్తూరి కూడా బిడ్డతో సహా, న్యూడ్‌గా కనిపించి, అవేర్‌నెస్‌ పెంచే ప్రయత్నం చేసింది.

‘రచ్చ’ సినిమాలో ఐటెం సాంగ్‌లో నటించిన లిసా హేడన్‌ (Lisa Haydon) సెమీ న్యూడ్‌ ఫోటోతో కనిపించి, ఈ తరహా మెసేజ్‌నే పాస్‌ చేసింది. నిజానికి అది న్యూడ్ ఫొటో కాదు. తన బిడ్డకు పాలిస్తున్న ఓ తల్లి ఆ ఫొటోలో కనిపిస్తుంది.

చెప్పుకుంటూ పోతే, ఒకరిద్దరు లేదా పది మంది మాత్రమే కాదు, గ్లామర్‌ ప్రపంచంలో తమ గ్లామర్‌తో ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించిన ఎందరో ముద్దుగుమ్మలు ఈ అవేర్‌నెస్‌లో భాగం పంచుకున్నారు.

అమ్మ.. ఆలోచన మారింది.. Breast Feeding Awareness

ఒకప్పుడు ముద్దుగుమ్మలు పెళ్లి తర్వాత సినిమాల్లో నటించేవారు కాదు. బహిరంగం ప్రదేశాల్లో కనిపించడానికి కూడా ఇష్టపడేవారు కాదు.

కానీ, ఇటీవల సమీరా రెడ్డి (Sameera Reddy), అమీ జాక్సన్‌ (Amy Jackson) తదితరులు తమ బేబీ బంప్‌ని ఎక్స్‌పోజ్‌ చేస్తూ, ప్రెగ్నెన్సీ అంటే సిగ్గుపడే విషయం కాదనీ, ఆ సమయంలో ఎక్స్‌పోజింగ్‌, చేయరాని నేరం అంతకన్నా కాదనీ చెబుతూ, ప్రెగ్నెన్సీలో తీసుకోవల్సిన జాగ్రత్తలు, ఆరోగ్య సూచనలూ చేయడం అందర్నీ ఆకట్టుకుంది.

తాజాగా నటి సమీరారెడ్డి ప్రెగ్నెన్సీ సమయంలో ప్రతీ మహిళా ఒత్తిడిని ఫీలవుతుందనీ, ఆ ఒత్తిడిని తొలగించి, భర్త ఆమెకు మానసిక ప్రశాంతతని కల్గించాలనీ, అప్పుడే తల్లీ, బిడ్డా.. ఇద్దరూ క్షేమంగా ఉంటారనీ తెలియచెబుతూ సోషల్‌ మీడియాలో ఆసక్తికరమైన పోస్ట్‌ పెట్టింది.

కొత్తగా ప్రెగ్నెంట్‌ అయిన తల్లుల్లో నెలకొనే ఆ రకమైన ఒత్తిడి ప్రభావం, ప్రసవం తర్వాత చనుబాలపై పడుతుందనీ, ఆ కారణంగా తల్లులు తమ పిల్లలకు సరిపడా పాలివ్వలేకపోతున్నారనీ సమీరా వాపోయింది.

అంతేకాదు, పాలిచ్చే తల్లులందరికీ ఓ సూచన కూడా చేసింది సమీరా రెడ్డి. పాలు పడలేదు అనే ఆందోళన పక్కన పెట్టాలనీ, బిడ్డకి పాలు పట్టే తీరులో కూడా పాల ఉత్పత్తి ఉంటుందని సమీరా రెడ్డి తెలిపింది. సమీరా సోషల్‌మీడియాలో పెట్టిన ఈ పోస్ట్‌ మహిళలను (Breast Feeding Awareness) ఇన్‌స్పైర్‌ చేసేలా ఉండడంతో, సోషల్‌ మీడియా వేదికగా ఆమెకు ప్రశంసలు దక్కుతున్నాయి.

Related Post

ప్రపంచం మెచ్చిన యోగా.. మనదేగా.!

Posted by - June 20, 2019 0
యోగా (Yoga).. అబ్బో ఇదేదో ముద్దుగుమ్మలు స్కిన్‌ షో చేసేందుకు ఉపయోగించే మాట అనుకుని ఇన్నాళ్లూ పక్కన పెట్టేశాం. అవును నిజమే, చూడ చక్కని అందాల భామలు…

కీటో డైట్‌: కొవ్వుతో కొవ్వుపైనే ఫైట్‌

Posted by - October 14, 2018 0
ఊబకాయమే అన్నిటికీ కారణం. డయాబెటిస్‌ (Diabetes), హైపర్‌ టెన్షన్‌ (Hypertension), హార్ట్‌ సంబంధిత వ్యాధులు (Heart Diseases), కిడ్నీ సమస్యలు (Kidney Problems).. ఒకటేమిటి.? క్యాన్సర్‌కి (Cancers)…

పింపుల్‌.. హౌ టు కిల్‌ ది డింపుల్‌.!

Posted by - September 11, 2018 0
ఓ ప్రముఖ రాజకీయ నాయకుడు, ఓ ప్రముఖ హీరోయిన్‌ బుగ్గలనుద్దేశించి అప్పట్లో చేసిన కామెంట్‌ సంచలనమైంది. అందాల భామ నునుపైన బుగ్గల్ని అందమైన రోడ్లతో పోల్చాడు. అందమైన…
Ram Charan, Pooja Hegde, NTR, Rakul Preet Singh, Fitness, Six Pack

సిక్స్‌ ప్యాక్‌ రౌడీస్‌ అండ్‌ లేడీస్‌.!

Posted by - September 17, 2018 0
ఇప్పుడు సిక్స్‌ ప్యాక్‌ బాడీ (Six Pack Fitness) అంటే ఎంత ట్రెండింగో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ట్రెండ్‌ని అచ్చంగా ఫాలో అయిపోయే కుర్రకారు ఈ సిక్స్‌బాడీ వైపు…

Leave a comment

Your email address will not be published. Required fields are marked *