Kushi Movie Post Mortem.. ఈ మధ్యనే ఓ సినిమా విడుదలైంది. డిజాస్టర్ టాక్ వచ్చినా, కాస్త నిలబడింది ఆ సినిమా.
ఎలాగైతేనేం, ఊపిరి పీల్చుకున్నానంటూ సదరు హీరో పండగ చేసుకున్నాడు. ఆ సందట్లో, భారీ ‘సాయం’ కూడా ప్రకటించేశాడు.
వంద కుటుంబాలకి లక్ష రూపాయల చొప్పున సాయం అంటే చిన్న విషయం కాదు కదా.! ఆ హీరో విజయ్ దేవరకొండ. ఆ సినిమా ‘ఖుషీ’.!
శివ నిర్వాణ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన ‘ఖుషి’ సినిమాలో సమంత హీరోయిన్‌గా నటించిన సంగతి తెల్సిందే.
ఈ సినిమాకి కొన్ని వెబ్‌సైట్లు రివ్యూలు బాగానే రాశాయ్. అలా బాగా రివ్యూలు వచ్చిన సైట్లకు సంబంధించి, ‘పెయిడ్’ ప్రచారమూ గట్టిగా సాగింది.
Kushi Movie Post Mortem.. ఎక్కడ తేడా వచ్చిందబ్బా.?
ఎక్కడ తేడా వచ్చిందోగానీ, పేమెంట్ అందుకుని ‘ఆహా.. ఓహో..’ అంటూ సినిమా గురించి పొగిడిన వెబ్ సైట్లు, ఆ తర్వాత సినిమాకి ‘పోస్టు మార్టమ్’ షురూ చేశాయ్.

అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, మరింత పేమెంట్ ఆశించి భంగపడ్డ సదరు వెబ్ సైట్లు, ‘ఖుషి’ టీమ్‌పై బ్లాక్‌మెయిలింగ్‌కి దిగినట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలోనే ‘పోస్టుమార్టమ్’ అంటూ ‘ఖుషి’ సినిమాపై తమ పైత్యాన్ని మేగ్జిమమ్ ప్రదర్శించారంటూ సినీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
Also Read: చచ్చేది ఒక్కసారే.! ఎవరికైనా తప్పదది.!
గత కొంతకాలంగా, సినిమాలకి ఈ మాఫియా ఓ పెను శాపంగా మారుతోంది. కానీ, నిర్మాతలు సైతం ఏమీ చేయలేని పరిస్థితి.
అప్పుడప్పుడూ, కొందరు సినీ ప్రముఖులు సోకాల్డ్ ‘ఎర్నలిస్టుల’పైనా, సదరు వెబ్ సైట్లపైనా స్పందించాల్సిన తీరులోనే స్పందిస్తున్నా.. ప్చ్.. మార్పు వుండటంలేదు.
ఇక, ‘ఖషీ’ విషయానికొస్తే, విజయ్ దేవరకొండ కొంత మేర ఊరట పొందాడు ఈ సినిమాతో. హీరోయిన్ సమంత కూడా బౌన్స్ బ్యాక్ అయ్యింది.! బహుశా చిత్ర యూనిట్ ఆశించిన విజయం దక్కి వుండకపోవచ్చు.!
కానీ, డిజాస్టర్ టాక్ నుంచి కోలుకోవడమంటే చిన్న విషయం కాదు. స్వల్ప నష్టాలతోనే ‘ఖుషీ గట్టెక్కిందన్నది ట్రేడ్ వర్గాల అంచనా.