Anushka Shetty Doubts Clarified.. అనుష్క ఒకప్పుడు స్టార్ హీరోయిన్ నో డౌట్. కానీ, ‘సైజ్ జీరో’ కోసం అనుష్క చేసిన చిన్న ప్రయోగం.. ఆమె కెరీర్ని పెద్ద దెబ్బ తీసేసింది.
‘సైజ్ జీరో’ కోసం పెరిగిన బరువును అనుష్క (Anushka Shetty) ఎంత కష్టపడినా తగ్గించుకోలేకపోయింది. చివరికి సినిమాలకే దూరం కావల్సి వచ్చింది.
ఎట్టకేలకు మళ్లీ అనుష్క సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చింది ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ ద్వారా. ఈ సినిమా చేసిందే కానీ, అనేక రకాల అనుమానాలు అనుష్క (Anushka Shetty) లో.
Anushka Shetty Doubts Clarified.. ఆ విషయంలో అనుష్క చాలా యాక్టివ్.!
ఆ కారణంగానే అనుష్క (Anushka Shetty) ప్రమోషన్లకీ రాలేదు. నిజానికి సినిమా ప్రమోషన్లంటే అనుష్క చాలా యాక్టివ్గా పాల్గొంటుంది. కానీ, ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ ప్రమోషన్లలో అనుష్క ఎక్కడా కనిపించింది లేదు.
ఫ్యాన్స్ తనను ఎలా రిసీవ్ చేసుకుంటారా.? అన్న అనుమానంతోనే అనుష్క ప్రమోషన్లకు హాజరు కాలేదట. కానీ, మంచి వెల్కమ్ దక్కింది అనుష్కకి ఈ సినిమా (Miss Shetty Mr Polishetty) ద్వారా.

ఎలాంటి నెగిటివిటీ రాలేదు. చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు ప్రేక్షకులు. సినిమాకీ పాజటివ్ టాక్ వచ్చింది. దాంతో అనుష్క ఇక నుంచి సినిమాలు చేయాలని నిర్ణయించుకుందట.
అనుష్క ఊ.. అనాలే కానీ, ఆమె కోసం సీనియర్ హీరోల సినిమాలు చాలానే రెడీగా వున్నాయ్. ‘మిస్ శెట్టి మిస్టర్ శెట్టి’ (Miss Shetty Mr Polishetty) సినిమాతో జస్ట్ ట్రైల్ వేసింది.
Also Read: ఎలుకాయ నమః బతికేద్దాం ఇంకొన్నేళ్ళు నిస్సిగ్గుగా.!
సక్సెస్ అయ్యింది. ఇక నుంచి ఈ సినిమాని ప్రమోట్ చేసేందుకు కూడా అనుష్క బయటికి వస్తుందట. అప్పుడిక ఆటోమెటిగ్గా అనుష్కకి అవకాశాలు క్యూ కట్టడం పక్కా. స్వీటీనా.! మజాకానా.!
ఒకప్పుడు అనుష్క రేంజ్ వేరు.! 50 కోట్ల బడ్జెట్తో సినిమా తెరకెక్కిస్తే, సింగిల్ హ్యాండెడ్గా బాక్సాఫీస్ వద్ద వసూళ్ళ కనక వర్షం కురిపించేది.! మళ్ళీ అలాంటి రోజెప్పుడొస్తుందో.!