ఇంతకీ నువ్వెవరు.? అసలు నువ్వెవరు.? ఎవరేంటి.? కన్నడ బ్యూటీ.! తెలుగు సినిమాల్లోనూ నటించేసిందీ భామ (Pranitha Subhash Guess Who). తమిళ, హిందీ సినిమాలూ చేసింది.
తెలుగులో చేసిన సినిమాల విషయానికొస్తే, ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన కూడా నటించేసింది ఈ కన్నడ కస్తూరి.!
పైగా, ఇప్పుడు ఈ బ్యూటీ ఇద్దరు పిల్లల తల్లి. అయినాగానీ, గ్లామర్ విషయంలో అస్సలేమాత్రం తగ్గేది లే.. అంటోన్న ఈ కన్నడ బ్యూటీ ఎవరో తెలుసా.?
Pranitha Subhash Guess Who.. బాపూ బొమ్మా..
‘అత్తారింటికి దారేది’ సినిమాలో పవన్ కళ్యాణ్ పాట గుర్తుంది కదా.? ఆ పాటలోని బ్యూటీనే ఈ ప్రణీత సుభాష్.! ‘బాపూ బొమ్మా..’ అంటూ అభివర్ణించేస్తాడు హీరో, హీరోయిన్‌ని ఆ పాటలో.
ఏమాటకామాటే చెప్పుకోవాలంటే, చక్రాల్లాంటి కళ్ళు.. ప్రణీత సుభాష్‌లో స్పెషల్ ఎట్రాక్షన్. గ్లామర్ విషయంలో అస్సలేమాత్రం తగ్గేదే లే.. అంటూ, వెండితెరపై అందాల ప్రదర్శన ఓ రేంజ్‌లో చేసేసింది.

అడపా దడపా సినిమాలు చేస్తోందిగానీ, సినిమాల సంగతెలా వున్నా, సోషల్ మీడియా వేదికగా.. ఇదిగో ఇలాంటి ఫొటోలతో యాక్టివ్‌గా వుంటూ, అభిమానుల్ని ఎంటర్టైన్ చేస్తోంది.
అన్నట్టు, ఈ బ్యూటీకి సేవా గుణం కాస్త ఎక్కువే.! కోవిడ్ సమయంలో ఆమె చేసిన సోషల్ సర్వీస్ అంతా ఇంతా కాదు.!