Table of Contents
Nutmeg Jajikaya Health Benefits.. జాజికాయ అంటే ఠక్కున గుర్తొచ్చేది టేస్టీ టేస్టీ బిర్యానీ. అవునండీ జాజికాయ లేకుండా బిర్యానీ ఘుమఘుమ ముక్కు వరకూ చేరేదే లే.!
కేవలం బిర్యానీలో మాత్రమే కాదండోయ్.. పలు రకాల సలాడ్స్, డెజర్ట్స్, కొన్ని రకాల వెజ్ వంటకాల్లోనూ జాజికాయను వినియోగిస్తుంటారు.
అయితే, టేస్ట్ కోసమే జాజికాయను వాడతారా.? కానే కాదు. జాజికాయతోనూ కొన్ని రకాలు కాదు.. కాదు చాలా రకాలా ఆరోగ్య ప్రయోజనాలున్నాయండోయ్.
Nutmeg Jajikaya Health Benefits.. పురుషుల్లో వీర్య కణాల వృద్ధికి..
మరీ ముఖ్యంగా పురుషుల్లో జాజికాయను వాడడం వల్ల వీర్య కణాలు వృద్ధి చెందుతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతుంటారు.
అలాగే మహిళలు కూడా ఖచ్చితంగా తమ డైట్లో చేర్చుకోవల్సిన మసాలా ఐటెమ్ జాజికాయ (Nutmeg). వయసు రీత్యా స్ర్తీలలో వచ్చే హార్మోనల్ ఇంబాలెన్స్ని నియంత్రణలో వుంచేందుకు జాజికాయ తోడ్పడుతుందట.

జాజికాయలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు.. కడుపులో మంటను నివారిస్తాయ్. గ్యాస్ నొప్పులు, అజీర్ణం వంటి సమస్యలు దరి చేరనివ్వవు.
నిద్ర లేమిని దూరం చేసేందుకు..
నిద్రలేమి సమస్యతో బాధపడేవారు మార్కెట్లో లభించే స్లీపింగ్ పిల్స్ వాడుతుంటారు. వాటి వల్ల అనేక రకాల సైడ్ ఎఫెక్ట్స్ బారిన పడుతుంటారు.
అయితే, ఒక గ్లాసు పాలలో చిటికెడు జాజికాయ పౌడర్ మిక్స్ చేసుకుని రాత్రి పడుకునే ముందు తీసుకుని పడుకుంటే నిద్రలేమి సమస్య దూరమవుతుందని తాజా అధ్యయనాలు వెల్లడి చేస్తున్నాయ్.
అలాగే, జాజికాయ నుంచి తీసిన నూనె ఆర్ధరైటిస్, కండరాల నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుందట. సహజ నొప్పి నివారిణిగా పని చేస్తుందని చెబుతున్నారు.
అల్జీమర్స్ రాకుండా చేస్తుంది. మెదడు చురుగ్గా పని చేసేందుకు తోడ్పడుతుంది.
గర్భిణీ స్త్రీలు తస్మాత్ జాగ్రత్త..
గర్భిణీ స్త్రీలు ఒకింత జాజికాయకు దూరంగా వుండాలని వైద్యులు సూచిస్తున్నారు. మోతాదుకు మించి తీసుకుంటే, గర్భంపై ప్రతికూల ప్రభావం చూపింస్తుందని చెబుతున్నారు.

అంతేకాదు, అతి సర్వత్రా వర్జయేత్ కదా.! ఆరోగ్యానికి మంచిది కదా.. అని అతిగా జాజికాయను అస్సలు వాడరాదని అంటున్నారు.
చాలా తక్కువ మోతాదులో మాత్రమే జాజికాయను వాడాలని హెచ్చరిస్తున్నారు. ఏ వంటకం అయినా అతి తక్కువ పరిమాణంలో తీసుకుంటేనే అజీర్ణం, ఉబ్బరం.. వంటి సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు.
అంతకు మించి ఎక్కువ వినియోగిస్తే.. ఆరోగ్య పరంగా అనేక రకాల దుష్ప్రభావాల బారిన పడాల్సి వస్తుందట.
గమనిక: ఇది కేవలం మీ అవగాహన, చిన్నపాటి ఉపశమనం కోసం మాత్రమే.
ఇంటర్నెట్లో అందుబాటులో వున్న సమాచారం ప్రకారం.. కొందరు వైద్య నిపుణులు అందించిన సూచనలూ, సలహాల ప్రకారం, ప్రాక్టికల్‌గా చేసిన కొన్ని సర్వేల ఫలితం ఆధారంగా ఈ సమాచారాన్ని అందించబడమైనది.
Also Read: పీడకలలు వస్తున్నాయా.? ఏం జరుగుతుందంటే.!
తీవ్రతరమైన ఆరోగ్య సమస్యలకు చిట్కాలు పాటించి, అపాయాన్ని కొనితెచ్చుకోవద్దు.. వైద్యుని సలహా తప్పక పాటించాల్సిందే.