Spinach Health Benefits.. పాలకూరతో మతిమరుపుకు చెక్.!

Spinach
Spinach Health Benefits.. వయసుతో పాటూ వచ్చే మతిమరుపు రాకుండా వుండాలంటే పాలకూరను మన డైలీ డైట్‌లో భాగం చేసుకోవాలంటున్నారు వైద్య నిపుణులు.
అవును నిజమే.! పెరుగుతున్న వయసుతో పాటూ, కాస్త ఛాదస్థం.. అలాగే మతిమరుపు కూడా సర్వ సాధారణంగా వచ్చే ఆరోగ్య సమస్యలు.
వాటిని నియంత్రణలో వుంచేందుకు పాలకూర మంచి ఔషధంలా పని చేస్తుందట. పాలకూరలోని ఫ్లేవనాయిడ్స్ మతిమరుపును దూరంగా వుంచుతాయని తాజా అధ్యయనాల్లో తేలింది.
Spinach Health Benefits.. స్త్రీలు ఖచ్చితంగా తినాల్సిందే.!
అన్ని రకాల ఆకుకూరలూ అందరికీ నచ్చవు. కానీ, అందరూ ఇష్టంగా తినే ఆకుకూరల్లో పాలకూర (Spinach) మొదటి వరుసలో వుంటుందని చెప్పడం అతిశయోక్తి కాదేమో.
పాలకూరలో ఫైబర్ పుష్కలంగా వుంటుంది. అలాగే శరీరానికి కావల్సిన ఐరన్ పాలకూరలో మెండుగా లభిస్తుంది. ఐరన్ తగిన మోతాదులో శరీరానికి అందడం వల్ల రక్త హీనత రాకుండా వుంటుంది.

రక్తాన్ని శుద్ధి చేయడంలోనూ పాలకూర కీలక పాత్ర వహిస్తుంది. స్త్రీలు తప్పకుండా తీసుకోవల్సిన ఆకుకూరల్లో పాలకూర ఒకటి. సౌందర్య లేపనంగానూ పాలకూరను వినియోగించవచ్చు.
పాలకూర తింటే కిడ్నీ స్టోన్స్ వస్తాయా.?
చాలా మంది పాలకూర తింటే కిడ్నీలో రాళ్లు వస్తాయని అపోహ పడుతుంటారు. కేవలం అది అపోహ మాత్రమే. కిడ్నీలు ఆరోగ్యంగా పని చేసేందుకు పాలకూర (Spinach) చక్కగా తోడ్పడుతుంది.
రోగ నిరోధక శక్తిని పెంచడంలో పాలకూర కీలక పాత్ర పోషిస్తుంది. పాలకూరను తరచూ తీసుకునే వారిలో ఒవేరియన్ క్యాన్సర్ ముప్పు చాలా చాలా తక్కువ అని తాజా అధ్యయనాల్లో వెల్లడైంది.
పాలకూరలో 13 రకాల యాంటీ ఆక్సిడెంట్లున్నాయ్. ఇవి యాంటీ క్యాన్సర్ ఏజెంట్లుగా పని చేస్తాయ్. అలాగే గుండె సంబంధిత వ్యాధులను దూరంగా వుంచడంలో పాలకూర పాత్ర అంతా ఇంతా కాదు.
Also Read: దంత సమస్యలు.. పసందైన వంటింటి చిట్కాలు.!
పాలకూర (Spinach) లో విటమిన్ ‘సి’, విటమిన్ ‘ఎ’ తో పాటూ, మెగ్నీషియం, ఫోలిక్ యాసిడ్ అదనంగా వుంటాయ్.
ఇవి ఊపిరితిత్తులను ఆరోగ్యంగా వుంచడంతో పాటూ, బ్రెస్ట్ క్యాన్సర్ ముప్పు నుంచి కాపాడేందుకు తోడ్పడతాయ్.
