Kalyan Ram Devil.. సినిమాని ప్రమోట్ చేయడంలో రకరకాల స్ట్రాటజీలు చూస్తుంటాం. తాజాగా కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కుతోన్న ‘డెవిల్’ సినిమాకి సంబంధించిన ప్రమోషన్లు ఒకింత చిత్రంగానూ ఆశ్చర్యంగానూ అనిపిస్తున్నాయ్.
అసలింతకీ ఏంటి ముచ్చట.! నవంబర్‌లో ‘డెవిల్’ సినిమా రిలీజ్‌కి సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్లు షురూ చేశారు చిత్ర యూనిట్.
సినిమా అన్నాకా డైరెక్టర్ ఎవరో ఒకరుండాలిగా.. ఆయనే నవీన్ మేడారం. అయితే, ‘డెవిల్’ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసినప్పుడు ఈ సినిమ డైరెక్టర్ ప్లేస్‌లో ఇదే పేరుంది.
Kalyan Ram Devil.. డైరెక్టర్ పేరు ఎలా మిస్ అయ్యిందబ్బా.!
విచిత్రమేంటంటే, తాజాగా రిలీజ్ చేసిన ప్రమోషన్ చిత్రంలో మాత్రం ఈయన పేరు లేదు. ఆ ప్లేస్‌లో నిర్మాత అభిషేక్ నామా పేరుంది.

అభిషేక్ పిక్చర్స్ పతాకంపై ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. సరే, బాగానే వుంది. నిర్మాతతో పాటూ, డైరెక్టర్ పేరు కూడా వుండి తీరాలిగా ఏ సినిమా పోస్టర్ అయినా.
అందుకే ఒకింత ఆశ్చర్యం.. రవ్వంత అనుమానం రేకెత్తిస్తోంది ‘డెవిల్’. డైరెక్టర్‌కీ, నిర్మాతకీ ఏమైనా గొడవలు జరిగాయా.? అన్నది ఆ అనుమానాశ్చర్యాల సారాంశం.
సందట్లో సడేమియా అన్నట్లుగా డైరెక్టర్ నవీన్ మేడారం.. తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ ఈ అనుమానాలన్నింటికీ ఆధ్యం పోసినట్లయ్యింది.
ఇదో రకం పబ్లిసిటీనా.?
‘వినాశ కాలే విపరీత బుద్ధి..’ అనే అర్ధం వచ్చేట్లుగా సంస్కృతంలో ఓ పోస్ట్ పెట్టారాయన. అయితే, ఈ పోస్ట్‌కి చిత్ర యూనిట్ ఎవ్వర్నీ ట్యాగ్ చేయలేదనుకోండి.

అయినా సరే, నిప్పు లేనిదే పొగ రాదు కదా.. దాంతో ‘డెవిల్’ విషయంలో ఏదో జరుగుతోందంటూ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
Also Read: ‘పుష్ప’రాజ్.! మళ్ళీ వస్తున్నాడుగానీ.!
అసలేంటీ.? ‘డెవిల్ డైలమా’.! ఇంత జరుగుతున్నా ఈ సినిమా హీరో కళ్యాణ్ రామ్ స్పందించడం లేదెందుకు.! ఇదంతా సినిమా ప్రమోషన్ స్ట్రాటజీలో భాగమేనా.!
ఈ రకంగా అందరూ సినిమా గురించి మాట్లాడుకోవాలన్న స్కెచ్ ఏమైనానా.! తెలియాల్సి వుంది.