Priyanka Singh Bigg Boss Telugu.. కాలం మారుతోంది. ఒకప్పుడు భర్త చనిపోతే, ఆ భర్త చితిలోకి భార్యని కూడా నెట్టేసేవారు. అలాంటి దురాచారాల నుంచి మనల్ని మనం చాలా మార్చుకున్నాం. ఇప్పుడు భర్త బతికుండగానే, ఇంకొకరితో ప్రేమాయణం నడుపుతున్న మహిళా‘మణు’లున్నారు. ఇక్కడ ఎవర్నీ నిందించలేం. కాలం మారుతోంది.. మనిషి కూడా మారక తప్పడంలేదని సరిపెట్టుకోవాలేమో.
అతడు.. ఆమెగా మారితే.? ఆమె, అతడిలా మారితే.! నిజానికి, ఇదేమీ నేరం కాదిప్పుడు. ఔను, అతడు.. ఆమెగా మారిపోయాడు. అలా మారిపోయినవారిలో కొందరు సెలబ్రిటీలు కూడా వున్నారు. మన తెలుగు నాట, ‘బిగ్ బాస్’ రియాల్టీ షో ఓ ట్రాన్స్‌జెండర్‌ని తొలిసారిగా ఇప్పటికే పరిచయం చేసింది. ఆ ట్రాన్స్‌జెండర్ ఎవరో కాదు తమన్నా సింహాద్రి.
Also Read: బిగ్ బాస్‌లో ఈ బూతులేంటి సరయు పాపా.?
మళ్ళీ ఇప్పుడు ఇంకో ట్రాన్స్‌జెండర్ బిగ్‌బాస్ రియాల్టీ షోలో హౌస్‌మేట్గా ఎంట్రీ ఇవ్వడం గమనార్హం. ఈసారి ట్రాన్స్‌జెండర్ కంటెస్టెంట్ ప్రియాంక సింగ్. గతంలో పేరు సాయి తేజ. జబర్దస్త్ కామెడీ షోలో కమెడియన్‌గా మంచి పేరు తెచ్చుకున్న సాయి తేజ్, ఎక్కువగా లేడీ గెటప్స్‌లో కనిపించేవాడు.
తనను తాను అబ్బాయిగా చూసుకోవడం నచ్చక, తన మనసుకు నచ్చిన దారిలో పయనించాలనే నిర్ణయానికి వచ్చిన, సర్జరీ చేయించేసుకుని.. అమ్మాయిగా మారిపోయినట్లు ప్రియాంక సింగ్ అలియాస్ సాయి తేజ చెప్పడం గమనార్హం.
తప్పొప్పులకు చోటు లేని కాలమిది. ఒకరి కోణంలో చూస్తే అది తప్పు కావొచ్చు, ఇంకొకరి కోణంలో అది ఒప్పు కావొచ్చు. సభ్య సమాజం ఏమనుకుంటుంది.? అన్న భయాలెప్పుడో పోయాయ్. సహజీవనం తప్పు కాదు.. స్వలింగ సంపర్కం నేరం కాదు.. ట్రాన్స్‌జెండర్ అవడమూ తప్పు కాదు.