Sreeleela Marriage Rumors.. అప్పుడే శ్రీలీలకి పెళ్ళేంటి.? ఏం, ఎందుకు చేసుకోకూడదు.? ఎవరిష్టం వాళ్ళది.! కాకపోతే, ప్రస్తుతం శ్రీలీల వరుస సినిమాలతో బిజీగా వుంది.
ఓ వైపు ఉన్నత చదువులు, ఇంకో వైపు సినిమాలు.. వెరసి, క్షణం తీరిక లేకుండా వుంది శ్రీలీల.!
ఇంతలోనే, శ్రీలీల చుట్టూ పెళ్ళి పుకార్లు.! అదీ, నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞతో శ్రీలీల పెళ్ళంటూ కొందరు పుట్టించేసిన పుకార్లు, మీడియా సర్కిల్స్‌లో హాట్ టాపిక్ అయ్యాయి.!
Sreeleela Marriage Rumors.. పనీ పాటా లేనోళ్ళు పుట్టించే పుకార్లు..
అసలు ఇలాంటి గాసిప్స్ ఎలా పుట్టుకొస్తాయ్.? దీనికేమీ రీసెర్చ్ చేయాల్సిన పనిలేదు. పిచ్చితనానికి హద్దూ అదుపూ వుండదు కదా.. ఇదీ అంతే.!
నందమూరి బాలకృష్ణ తాజా చిత్రం ‘భగవంత్ కేసరి’లో శ్రీలీల ఓ కీలక పాత్రలో కనిపించబోతోంది. కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) కూడా ఈ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

కాగా, ‘భగవంత్ కేసరి’ టీమ్‌కి సంబంధించిన ఓ ఫొటోలో మోక్షజ్ఞ కూడా కనిపించాడు. బాలకృష్ణ, శ్రీలీల కూడా వున్న ఆ ఫొటోలోకి మోక్షజ్ణ ఎందుకొచ్చాడు.? అన్న కోణంలో గాసిప్స్ పుట్టేశాయంతే.!
ఇక, ఈ విషయమై శ్రీలీల ఒకింత గుస్సా అవుతోందిట. అయితే, బాలయ్య (Nandamuri Balakrishna) మాత్రం.. ఇలాంటి చెత్తని లైట్ తీసుకోమని శ్రీలీలకి చెప్పాడట.!
Also Read: రషా తదానీ.! రామ్ చరణ్ హీరోయిన్ ఈమేనా.?
శ్రీలీల (Sreeleela) హీరోయిన్‌గా తాను హీరోగా ఓ సినిమా చేయాలనుకుంటున్నట్లు బాలయ్య చెబితే, ‘గ్రౌండ్ ఫ్లోర్ బలిసిందా.?’ అని మోక్షజ్ఞ తన తండ్రి బాలయ్యని నిలదీశాడని బాలయ్యే స్వయంగా చెప్పుకున్న సంగతి తెలిసిందే.
ఏదో సరదాకి బాలయ్య (Nandamuri Balakrishna) ఆ మాట చెబితే, దాని చుట్టూ ఏకంగా పెళ్ళి పుకార్లు సృష్టించేశారు.! అదీ అసలు సంగతి.!
‘భగవంత్ కేసరి’ సినిమా ఈ నెల 19న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది.