Renu Desai Slams Media.. మీడియా ఎక్కడుంది.? ఇప్పుడు మనం చూస్తున్నదంతా మాఫియానే.! సెలబ్రిటీల మీద అత్యంత జుగుప్సాకరమైన ప్రచారమే ‘మీడియా’ పని అన్నట్లుంది పరిస్థితి.
ప్రధానంగా పవన్ కళ్యాణ్ – రేణు దేశాయ్ చుట్టూ ఎప్పటికప్పుడు అంత్యంత జుగుప్సాకరమైన ప్రచారాన్ని ఓ వర్గం మీడియా పనిగట్టుకుని చేస్తూనే వుంది.
ఈ వ్యవహారంపై సినీ నటి రేణు దేశాయ్ తాజాగా స్పందించారు.
‘దురుద్దేశపూరిత కథనాల, దుష్ప్రచారాలు.. వీటి ద్వారా సంపాదించే సంపాదన మీకు మంచిది కాదు..’ అంటూ సున్నితంగానే ‘పెంటలో ముంచిన చెప్పుతో’ కొట్టారు ఓ మీడియా ప్రతినిథిని.
Renu Desai Slams Media.. మీకు.. మీ పిల్లలకి కూడా మంచిది కాదు..
‘మీకే కాదు, మీ పిల్లలకీ అది మంచిది కాదు.. కర్మ ఫలితం.. ఎవర్నీ వదిలిపెట్టదు..’ అని రేణు దేశాయ్, ఓ వర్గం మీడియాని శపించినంత పని చేశారు.
పవన్ కళ్యాణ్ – రేణు దేశాయ్, చాలాకాలం క్రితం ప్రేమలో పడ్డారు, ఇద్దరూ కొన్నాళ్ళు సహజీవనం చేశారు. ఆ తర్వాత పెళ్ళి చేసుకున్నారు.
ఇరువురి మధ్యా అభిప్రాయ బేధాలో వచ్చాయో, ఇంకేమైనా జరిగిందో.. ఇద్దరూ విడాకులు తీసుకున్నారు.. ఇది జరిగీ చాలాకాలమే అయ్యింది.
ట్రోలింగ్ ఇకనైనా ఆగేనా.?
కానీ, రేణు దేశాయ్ పేరు ప్రస్తావిస్తూ తరచూ పవన్ కళ్యాణ్ మీద ట్రోలింగ్ ఓ అలవాటుగా మారిపోయింది కొందరికి.
ఆమె పేరు ప్రస్తావించకుండానే, బాధ్యతగల పదవుల్లో వున్నోళ్ళూ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారు పవన్ కళ్యాణ్ మీద.
ఈ క్రమంలో అందరికీ కలిపి ‘కోటింగ్’ గట్టిగానే ఇచ్చేశారు రేణు దేశాయ్.! ప్రముఖల వ్యక్తిగత జీవితాల మీద జనంలో ఆసక్తి వుండడం సహజమే.
Also Read: వా..మిక.! ఈ బ్యూటీని టాలీవుడ్ పట్టించుకోలేదేం.!
కాకపోతే, దానికీ ఓ హద్దు వుంటుందన్న విషయాన్ని మీడియా విస్మరిస్తే ఎలా.? మీడియా, రాజకీయం.. కలగలిసి ఓ పాత్రికేయ వ్యభిచార మాఫియాలా తయారవ్వడం వల్లే ఈ దుస్థితి.
నిజానికి, రేణు దేశాయ్ తన మీద మీడియా ప్రదర్శిస్తున్న పైత్యంపై పలు మార్లు స్పందించారు. కానీ, మీడియా తీరు మారలేదు. ఇకనైనా మారుతుందా.? అంటే, సందేహమే.!