Table of Contents
Rashmika Mandanna Deepfake.. డీప్ ఫేక్ అనే మాట సోషల్ మీడియాలో ప్రముఖంగా వినిపిస్తోంది. అసలేంటీ డీప్ ఫేక్.! ఇదొక టైపు మార్ఫింగ్.
మామూలుగా మార్ఫింగ్ అంటే, ఫొటోషాప్ ఎడిట్.. ఇది ఫొటోలకే పరిమితం. వీడియో ఎడిటింగ్.. ఇందులో బోల్డన్ని మార్పులు వచ్చేశాయ్.!
కొత్తగా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ అందుబాటులోకి వచ్చేసింది. మనిషిని పోలిన ఇమేజ్‌తో అచ్చం మనిషిలా, వార్తలు చదివించేస్తున్న రోజులివి.
సో, ఓ సెలబ్రిటీ తాలూకు వీడియోని మార్ఫింగ్ చేయడం చిటికెలో పని. చిన్న చిన్న యాప్స్‌తోనే మార్ఫింగ్ వీడియోలు చేసేయొచ్చు.
Rashmika Mandanna Deepfake.. డీప్ ఫేక్.. సీరియస్, చాలా చాలా సీరియస్.!
సరదాగా అయితే, దీని గురించి పెద్దగా ఆలోచించాల్సిన పనిలేదు. కానీ, విషయం సీరియస్. చాలా చాలా సీరియస్.
తాజాగా, నేషనల్ క్రష్ రష్మిక మండన్న మార్ఫింగ్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతోంది.
అచ్చం ఒరిజినల్‌లా వుందీ వీడియో. మరీ అసభ్యకరంగా ఏమీ లేదుగానీ, ఒకింత గ్లామర్ డోస్ ఎక్కువ వుందంతే.

కానీ, ఈ విషయమై ప్రముఖ బాలీవుడ్ నటుడు అమిత్ బచ్చన్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. పలువురు సినీ ప్రముఖులు, రష్మిక మండన్నకి బాసటగా నిలుస్తున్నారు.
వీడియో చూశాక, చాలా బాధ కలిగిందనీ, సమాజంలో ఎవరికైనా తనలాంటి బాధ కలిగే ప్రమాదం వుందని రష్మిక వాపోయింది. అందులో నిజం లేకపోలేదు.
ఏది తప్పు.? ఏది ఒప్పు.?
తెరపై రష్మిక మండన్న హద్దులు దాటి అందాల ప్రదర్శన చేస్తే తప్పు లేదా.? ఈ వీడియోలో అంత వల్గారిటీ ఏముందని.? అన్న ప్రశ్నలు వినిపించడం సహజమే.
రష్మిక తన ఇష్టంతో చేసే అందాల ప్రదర్శనకీ, తనకు సంబంధం లేకుండా తన పేరుతో సర్క్యులేట్ అవుతున్న వీడియోలకీ చాలా చాలా తేడా వుంది. ఇది క్షమార్హం కాని నేరం.

వ్యవస్థలు ఎలాంటి చర్యలు తీసుకుంటాయ్.? అన్న విషయం పక్కన పెడితే, వీటిని నియంత్రించలేమన్నది నిష్టురసత్యం.
చేతిలో స్మార్ట్ ఫోన్ వుంటే చాలు, ఏదైనా సాధ్యం. కోట్లాది మంది స్మార్ట్ ఫోన్లను వినియోగిస్తున్నారు. అలా వినియోగిస్తున్నవారిలో కొందరు ఆకతాయిల్ని ఎలా నియంత్రించేది.? పిల్లి మెడలో గంట కట్టేదెలా.?
భయపడేలా శిక్షలుంటేనే..
శిక్షలకు భయపడే రోజులెప్పుడో పోయాయ్.! నేరం చేసి తప్పించుకోవడం ఈ రోజుల్లో చాలా తేలిక. శిక్ష పడినా, పబ్లిసిటీ వస్తుందనే మొండితనమూ పెరిగిపోయింది యువతలో.!
అన్నట్టు, రష్మిక మండన్న పేరుతో సర్క్యులేట్ అవుతున్న వీడియోలో, శరీరం ఎవరిదో తెలుసా.? జారా పటేల్. సోషల్ మీడియాలో వీడియోలతో పాపులర్ ఆమె.
Also Read: మళ్ళీ పెళ్ళి పీటలెక్కనున్న అమలా పాల్.!
‘జారా పటేల్’ లాంటోళ్ళు, అంతకు మించి కేవలం వల్గారిటీ కోసం మాత్రమే, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్ బుక్, ట్విట్టర్ వంటి వాటిని వాడేటోళ్ళు కోకొల్లలు వున్నారు.

అలాంటోళ్ళ వీడియోలతో, సెలబ్రిటీల తలకాయలు చేర్చి మార్ఫింగ్ చేసెయ్యడం.. పైన పేర్కొన్న ఆకతాయిలకు పెద్ద కష్టమేమీ కాదు.!
కొసమెరుపేంటంటే, సదరు జారా పటేల్.. ‘డీప్ ఫేక్’ వ్యవహారంపై స్పందించింది తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా. డీప్ ఫేక్ దారుణమైన విషయమనీ, దీంతో తనకు సంబంధం లేదనీ జారా పటేల్ పేర్కొంది.