Mouni Disha Vacation.. ఇందులో తేడా ఏముంది.? ఇద్దరమ్మాయిల మధ్య స్నేహం వుండకూడదా.? అందులో ఒకరికి ఆల్రెడీ పెళ్ళయ్యాక.. సమస్య ఏముందని.?
చీ.. పాడు లోకం.! అన్నిటినీ ‘ఛీ’ అన్నట్టుగానే చూస్తుంటుంది. అదే అసలు సమస్య.! ఇంతకీ ఏమయ్యింది.?
విషయమేంటంటే, బాలీవుడ్ నటి మౌనీ రాయ్, మరో బాలీవుడ్ నటి దిశా పటానీ.. మంచి స్నేహితులు.! ఇద్దరూ కలిసి విదేశాల్లో ‘వెకేషన్’ ఎంజాయ్ చేశారు.
ఇందులో తప్పేముందబ్బా.? కలిసి వెళ్ళింది ఇద్దరమ్మాయిలే కదా.! అయినా, భర్తని కాదని.. స్నేహితురాలితో విదేశాలకు వెళ్ళి ఎంజాయ్ చేయడమేంటి.? అన్నది కొందరి ప్రశ్న.
Mouni Disha Vacation.. ఫొటోలు వైరల్..
అటు మౌనీ రాయ్.. ఇటు దిశా పటానీ.. ఇద్దరూ సోషల్ మీడియాలో పోటీ పడి తమ వెకేషన్ ఫొటోల్ని షేర్ చేశారు.
అక్కడే మొదలైంది అసలు రచ్చ.! ఇద్దరూ బికినీల్లో సందడి చేశారు. చిత్రంగా ఇద్దరూ ముద్దులు పెట్టేసుకున్నారు.! ఆగండాగండీ.. ఎక్కడో తేడా కొడుతోంది కదా.!

ముందే చెప్పుకున్నాం కదా.! ఛీ.. పాడు కళ్ళు.! పచ్చ కామెర్ల వాడికి లోకమంతా పచ్చగా కనిపిస్తుందో లేదోగానీ, ఇక్కడైతే తేడాగా కనిపించింది కొందరికి.
ఇంకేముంది.? సోషల్ మీడియాలో అటు మౌనీ రాయ్, ఇటు దిశా పటానీ (Disha Patani) మీద ఎడా పెడా ఘాటైన కామెంట్లు పోస్ట్ చేసేశారు.
అయినా, ఇలాంటి సోషల్ ట్రోలింగ్‌కి తగ్గే రకమా.? ఛాన్సే లేదు.! మౌనీ రాయ్ (Mouni Roy Nambiar), దిశా పటానీ మరింతగా చెలరేగిపోయారు.

స్వలింగ సంపర్కులనీ, ఇంకోటనీ.. బోల్డన్ని కామెంట్స్ ఇంకా పడుతూనే వున్నాయ్ దిశా పటానీ (Disha Patani), మౌనీ రాయ్ (Mouni Roy)ల మీద.!
అన్నట్టు, రాశి ఖన్నా – వాణీ కపూర్ మంచి స్నేహితులు. ఈ ఇద్దరూ క్రిస్‌మస్ సందర్భంగా షేర్ చేసిన ఫొటోలపైనా ఇలానే ట్రోలింగ్ జరిగిందండోయ్.!
Also Read: Raashi Khanna: బ్లాక్ & వైట్ అందాల దాడి! ఇది వేరే లెవల్!
అక్కా చెల్లెళ్ళయిన కాజల్ అగర్వాల్, నిషా అగర్వాల్ ఫొటోల్ని చూసి కూడా ఇలానే ట్రోల్ చేస్తుంటారు.! అందుకే అనేది ఛీ.. పాడు లోకం.. అని.!