Sandeep Reddy Vanga Chiranjeevi.. మెగాస్టార్ చిరంజీవికి వీరాభిమాని డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా.
ఈయన రీసెంట్ మూవీ ‘యానిమల్’లో తప్పొప్పులున్నప్పటికీ ఆ మెగాభిమానమే ‘యానిమల్’ని విజయవంతం చేయడంలో సాయపడిందన్న ప్రచారం కూడా లేకపోలేదు.
ఈ సినిమా ప్రమోషన్లలో పదే పదే మెగాస్టార్ చిరంజీవిపై (Mega Star Chiranjeevi) తన అభిమానాన్ని చాటుకుంటూ వచ్చాడు సందీప్ రెడ్డి వంగా.
అంతేకాదు, ఈ సినిమా విజయాన్ని దృష్టిలో పెట్టుకుని మెగాస్టార్ చిరంజీవి, సందీప్ రెడ్డి వంగాకి పర్సనల్‌గా ఫోన్ చేసి అభినందించారట కూడా.
Sandeep Reddy Vanga Chiranjeevi.. అభిమాని అడిగితే చిరంజీవి కాదనగలరా.?
ఈ నేపథ్యంలోనే మెగాస్టార్ చిరంజీవితో సినిమా తీయాలన్న తన మనసులోని కోరికను సందీప్ రెడ్డి వంగా, చిరంజీవి ముందుంచాడట.
ఇంతలా అభిమానిస్తున్న తన అభిమాని తనతో సినిమా తీస్తానంటే చిరంజీవి కాదనగలరా.? చిరంజీవి కోసం సందీప్ రెడ్డి వంగా కథ కూడా సిద్ధం చేశారట.

కథ కాదు.. పదుల సంఖ్యలో కొన్ని కథలు సిద్ధంగా వున్నాయట సందీప్ రెడ్డి (Sandeep Reddy Vanga) దగ్గర. కానీ, సందీప్ రెడ్డి వంగా చేతిలో ప్రస్తుతం ఆల్రెడీ కమిట్ అయిన కథలు.. పూర్తి చేయాల్సిన ప్రాజెక్టులూ చాలానే వున్నాయ్.
మెగాస్టార్ కోసం సందీప్ రెడ్డి వాటిని పక్కన పెట్టేస్తాడా.?
అలాగే, కొన్ని కమిటెడ్ కాంబినేషన్లు కూడా వున్నాయ్. సో, చిరంజీవితో సందీప్ రెడ్డి సినిమా అంటే.. ఇప్పట్లో సాధ్యం కాదన్న వాదన కూడా లేకపోలేదు.
అయితే తన అభిమాన నటుడు డేట్స్ ఇస్తే.. ఎన్ని కమిట్మెంట్లున్నప్పటికీ వాటన్నింటినీ పక్కన పెట్టి.. చిరుతో ప్రాజెక్ట్ పట్టాలెక్కించేయడానికి సందీప్ సిద్ధంగా వుండడూ.!
Also Read: Mouni Disha Vacation: ముద్దుగుమ్మల యవ్వారం తేడాగా వుందే!
అంతేకాదు, వీలైనంత వేగంగా.. ఓ అత్యద్భుతమైన సినిమాని చిరంజీవితో పూర్తి చేయడానికి సందీప్ రెడ్డి సిద్ధంగానే వున్నాడట కూడా.
ఏమో గుర్రం ఎగరా వచ్చు.! లెట్ అజ్ వెయిట్ అండ్ సీ దిస్ మెగా కాంబో.!