Rashmika Mandanna: దోచేశావ్ సరేగానీ, దాచేస్తున్నావెందుకు?

Rashmika Mandanna
Rashmika Mandanna Hiding Face.. చేసింది తక్కువ సినిమాలే అయినా, కాస్త ఎక్కువగానే కుర్రకారు హృదయాల్ని దోచేసింది నేషనల్ క్రష్ రష్మిక మండన్న.!
కన్నడ, తెలుగు, తమిళ, హిందీ.. ఇలా పలు భాషల్లో సినిమాలు చేస్తూ చాలా చాలా బిజీగా వున్న రష్మిక (Rashmika Mandanna), గత ఏడాది ‘యానిమల్’ రూపంలో మాంఛి కమర్షియల్ విజయాన్ని అందుకుంది.
‘యానిమల్’ (Animal The Film) సినిమాలో రష్మిక పాత్ర మీద చాలా విమర్శలొచ్చాయ్. ‘యానిమల్’ (Animal The Movie) సినిమా మీద వచ్చిన నెగెటివిటీ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.
నెగెటివిటీ, విమర్శల సంగతెలా వున్నా, ‘యానిమల్’ (Animal Movie) అంతిమంగా కమర్షియల్ యాంగిల్‌లో బాగానే వర్కవుట్ అయిన ప్రాజెక్ట్.
Rashmika Mandanna Hiding Face.. అప్పుడు ‘యానిమల్’.. త్వరలో ‘పుష్ప 2 ది రూల్’.!
అందుకే, ఇప్పుడంతా రష్మిక మండన్న లక్కు ఫ్యాక్టర్ గురించి మాట్లాడుకుంటున్నారు. ‘పుష్ప’ (Pushpa The Rise) విషయంలో కూడా అదే జరిగిందండోయ్.!
అన్నట్టు, 2024లో రష్మిక మండన్న (Rashmika Mandanna) నుంచి ‘పుష్ప 2 ది రూల్’ (Pushpa 2 The Rule) రాబోతోంది.! ఈ ఏడాది తనకు మరింత కలర్‌ఫుల్‌గా వుండబోతోందని చెబుతోంది రష్మిక.

ఈ మధ్యనే బాలీవుడ్‌లో ‘యానిమల్’ పార్టీ జరిగింది. ఆ పార్టీ కోసం రష్మిక, ఇదిగో ఈ గెటప్‌లోనే సందడి చేసింది. ఆ విషయాన్నే ఈ ఫొటోలతో సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది రష్మిక.!
Also Read: Vaishnavi Chaitanya: ‘లవ్ మి’ అంటోన్న ‘బేబీ’ బ్యూటీ!
యువ హృదయాల్ని దోచేశావ్ సరే, ఇలా నీ మొహాన్ని ఎందుకు దాచేస్తున్నావ్.? అంటూ, రష్మిక (Rashmika Mandanna) ఫొటోలు చూసి ఆమె అభిమానులు కామెంట్లేస్తున్నారు.!
చక్కనమ్మ ఏం చేసినా అందమే మరి.! అంతా బాగానే వుందిగానీ, ఫిబ్రవరిలో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) – రష్మిక మండన్న ‘ఎంగేజ్‌మెంట్’ జరగనుందంటూ వస్తున్న గాసిప్స్ సంగతేంటి.?
