Ramcharan Game Changer Jaragandi.. జరగండి.. జరగండి.. అంటూ ‘గేమ్ ఛేంజర్’ సినిమా నుంచి తొలి లిరికల్ సాంగ్ బయటకు వచ్చేసింది.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు (Happy Birthday Ram Charan) సందర్భంగా ఈ లిరికల్ సాంగ్‌ని ‘గేమ్ ఛేంజర్’ టీమ్ విడుదల చేసింది.
సిక్స్ ప్యాక్ యముడండీ.. సిస్టమ్ తప్పితే మొగుడండీ.. అంటూ సాగే లిరిక్స్‌లో దర్శకుడు శంకర్ (Director) మార్క్ స్పష్టంగా కనిపిస్తోంది.
విజువల్ ట్రీట్..
ప్రభుదేవా కొరియోగ్రఫీ అందించిన ఈ సాంగ్‌ని దర్శకుడు శంకర్, తనదైన స్టయిల్లో తెరకెక్కించాడు. శంకర్ సినిమాల్లోని పాటలకు వుండే రిచ్ లుక్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.
బోల్డంతమంది డాన్సర్లతో, అత్యద్భుతమైన సెట్స్‌తో ‘జరగండి’ పాటని రూపొందించిన వైనం.. చూసేవారికి జస్ట్ విజువల్ ట్రీట్ అంతే.
అయితే, రామ్ చరణ్ (Global Star Ramcharan) నుంచి అత్యద్భుతమైన డాన్సుల్ని ఆశించే అభిమానులకి, ఈ లిరికల్ సాంగ్ కాస్త నిరాశపరుస్తుంది.
చరణ్ – కియారా అద్వానీ (Kiara Advani).. ఇద్దరూ మంచి డాన్సర్లే. కొరియోగ్రఫీ ప్రభుదేవా (Prabhudeva). దాంతో, ఈ పాట నుంచి చాలా చాలా డాన్స్ ఆశిస్తారు అభిమానులు.

పాటలో ఖచ్చితంగా డాన్సులుంటాయ్.. కాకపోతే, ‘జరగండి.. జరగండి..’ లిరికల్ సాంగ్‌లో అవన్నీ దాచేసినట్లు కనిపిస్తోంది.
ప్రముఖ నిర్మాత దిల్ రాజు (Dil Raju) ఈ ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) సినిమాని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది.