Kushitha Kallapu New Rose.. కొన్నేళ్ళ క్రితం ఓ పబ్ ఎపిసోడ్ పుణ్యమా అని వార్తల్లోకెక్కింది కుషిత.! అప్పటినుంచి కుషిత ఫొటోలు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతూనే వున్నాయి.
ఆ మధ్య కొన్ని సినిమాల్లో చిన్నా చితకా రోల్స్ చేసింది కుషిత. తాజాగా, ఈ బ్యూటీకి ఓ వెబ్ సిరీస్‌లో ఛాన్స్ వచ్చింది.
గతంలో ఈషా రెబ్బ, పాయల్ రాజ్‌పుత్, పూర్ణ తదితరులు నటించిన ‘త్రీ రోజెస్’ వెబ్ సిరీస్ అప్పట్లో బాగానే సౌండ్ చేసింది.
Kushitha Kallapu New Rose.. జలకాలాటలలో కొత్త గులాబీ..
ఆ వెబ్ సిరీస్ కొత్త సీజన్ కోసం కుషితని ఎంచుకున్నారు మేకర్స్. అలా, ఓ కొత్త గులాబీగా కుషితకి అవకాశం దక్కిందన్నమాట.!
సోషల్ మీడియాలో చిన్న చిన్న వీడియోలు చేస్తూ, అప్పుడప్పుడూ క్యూట్ అండ్ హాట్ ఫొటోలు షేర్ చేస్తూ పాపులారిటీ దక్కించుకున్న కుషిత, ఈసారి వెబ్ సిరీస్‌తో సౌండ్ గట్టిగానే చేయబోతోంది.

అలా వెబ్ సిరీస్ అనౌన్స్‌మెంట్ రాగానే, ఇలా స్విమ్మింగ్ పూల్ ఫొటోలతో కుర్రకారులో కాక రేపడం షురూ చేసింది కుషిత.!
సినిమాల్లో హీరోయిన్‌గా ఛాన్సుల కోసం కుషిత ఎదురుచూస్తోందిట. ‘3 రోజెస్’ కొత్త సీజన్ గనుక హిట్టయితే, అందులో కుషిత పెర్ఫామెన్స్‌కి మంచి మార్కులు పడితే.. లక్కు తోక తొక్కినట్లే కదా.!