Table of Contents
మామూలుగా అయితే మేకింగ్ వీడియో అంటాం. కానీ, ‘షేడ్స్ ఆఫ్ సాహో’ (Shades of Saaho) అంటూ చాప్టర్స్ వారీగా ఆ మేకింగ్ వీడియోల్ని విడుదల చేస్తోంది ‘సాహో’ (Saaho Teaser) టీమ్.
ప్రభాస్ హీరోగా రూపొందుతోన్న ‘సాహో’ సినిమా తాలూకు మేకింగ్ వీడియో, ‘షేడ్స్ ఆఫ్ సాహో ఛాప్టర్ వన్’ (Shades of Saaho Chapter 1) గా ఈ రోజు విడుదలయ్యింది.
రెబల్ స్టార్ ప్రభాస్ (Rebel Star Prabhas) పుట్టినరోజు సందర్భంగా ఈ వీడియో ఇలా వచ్చిందో లేదో, క్షణాల్లో వైరల్ అయిపోయింది. ‘వ్యూస్’ పరంగా ఈ వీడియో సంచలనాలకు కేంద్ర బిందువు కాబోతోందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదమో.
డార్లింగ్ ప్రభాస్‌కి పుట్టినరోజు శుభాకాంక్షల వెల్లువ
ప్రభాస్ అంటే తెలుగు సినీ పరిశ్రమలో అందరికీ ‘డార్లింగ్’ (Darling Prabhas) అనే సంగతి తెలుసు కదా! వాళ్ళూ వీళ్ళూ అని కాదు, సినీ పరిశ్రమకు చెందిన ప్రతి ఒక్కరూ ప్రభాస్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నారు.
అందరి నోటా, ఒకటే మాట. ‘డార్లింగ్ ప్రభాస్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు’ (Happy BirthDay Prabhas) అని. ఎంత ఎదిగినా, ఒదిగి వుండే ప్రభాస్ వైఖరి.. ఆయన మంచితనమే ఇంతమంది అభిమానాన్ని ఆయన పొందేలా చేస్తోంది.
‘బాహుబలి’ సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నా, ప్రభాస్ ‘డౌన్ టు ఎర్త్’ అన్నట్లుగానే వుంటాడు.
వెయ్యి కోట్లు పక్కా.!
‘సాహో’ ఫస్ట్ ఛాప్టర్ చూశాక ఎవరైనాసరే, ఠక్కున ఇది వెయ్యి కోట్ల వసూళ్ళను సాధించే స్టామినా వున్న సినిమా అని ఒప్పుకోవాల్సిందే. యాక్షన్ ఎపిసోడ్స్‌ని ఆ స్థాయిలో రూపొందించారు మరి.
హాలీవుడ్ స్టంట్‌మేన్స్‌ని తీసుకొచ్చి, యాక్షన్ ఎపిసోడ్స్‌ని చేయడం గమనార్హం. కుర్రాడే అయినా, సుజీత్‌లోని కమిట్‌మెంట్ స్పష్టంగా కన్పిస్తోంది. ఓ వంద సినిమాలు తీసిన దర్శకుడి నుంచి వచ్చిన అల్టిమేట్ ఔట్‌పుట్ ఎలా వుంటుందో, అలా కన్పిస్తోంది ‘చాప్టర్ 1’.
ఇది జస్ట్ మేకింగ్ వీడియో మాత్రమే. అసలు సినిమా ముందుంది.
యాక్షన్ గర్ల్ శ్రద్ధా కపూర్
‘షేడ్స్ ఆఫ్ సాహో ఛాప్టర్ వన్’లో శ్రద్ధా కపూర్ (Shraddha Kapoor) కూడా కన్పించింది. ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోన్న శ్రద్ధ, కేవలం గ్లామర్‌కే పరిమితం కాదు. ఆమె పాత్ర సినిమాలో చాలా ప్రాధాన్యతతో కూడుకుని వుంటుందట. అదేంటో తెలాయలంటే సినిమా చూడాల్సిందే.
ఈలోగా ‘చాప్టర్ వన్’లో యాక్షన్ మోడ్‌లో కన్పిస్తున్న శ్రద్ధా కపూర్‌ని చూసి, ఆమె పాత్ర గురించి ఊహించేసుకోవచ్చు. యాక్షన్ సీక్వెన్సెస్ ఆమెకు కొత్త కాదు. అయితే, ఈ సినిమా కోసం ఆమె చేసిన రిస్కీ స్టంట్స్ మాత్రం చాలా స్పెషల్ అట.
మేకింగ్ వాల్యూస్ అద్భుతం (Saaho Teaser)
‘సాహో‘ మేకింగ్ వీడియో చూస్తే ఫస్ట్ ఫ్రేమ్ నుంచి చివరి ఫ్రేమ్ వరకూ క్వాలిటీ సూపర్బ్. క్వాలిటీ అంటే, సినిమా కోసం చేసిన ఖర్చు, ఆ ఖర్చు ద్వారా రాబట్టిన ఔట్ పుట్ అని అర్థం ఇక్కడ.
యూవీ క్రియేషన్స్ (UV Creations) ఈ సినిమాని అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోంది. పలు సంచలన విజయాల్ని అందుకున్న ఈ బ్యానర్ నుంచి రాబోయే ఈ సినిమా భారతీయ సినీ పరిశ్రమలోనే ఓ ప్రత్యేకతను సంతరించుకుంటుందని నిస్సందేహంగా చెప్పొచ్చు.
కింగ్ ఆఫ్ బాక్సాఫీస్ అంతే.!
‘సాహో’ (Saaho Teaser) మేకింగ్ వీడియో చివర్లో హీరో ప్రభాస్ ఎంట్రీ సూపర్బ్‌గా వుంది. స్టయిలిష్ బాడీ లాంగ్వేజ్‌కి పెట్టింది పేరైన ప్రభాస్, ‘బాహుబలి’ (Baahubali) మూడ్ నుంచి పూర్తిగా బయటకొచ్చేసి, కంప్లీట్ మేకోవర్‌తో చాలా స్టయిలిష్‌గా కనిపిస్తున్నాడు.
ప్రభాస్ ఎంట్రీకి అభిమానులు విజిల్స్, క్లాప్స్ వేసేస్తున్నారు.. ఇదంతా కంప్యూటర్లలోనో, స్మార్ట్ పోన్లలోనో చూస్తూనే. అదే థియేటర్లలో ఈ మేకింగ్ వీడియో చూస్తే ఇంకేమన్నా వుందా.?
బాలీవుడ్‌లో అమీర్‌ఖాన్ లాంటి అగ్రహీరోల సినిమాల రికార్డుల్ని అవలీలగా ‘బాహుబలి’ హిందీ డబ్బింగ్ మూవీతో బ్రేక్ చేసిన ప్రభాస్, ‘సాహో’ సినిమాతో మరో అద్భుతానికి తెరలేపనున్నాడని నిస్సందేహంగా చెప్పొచ్చు.