Ayesha Khan Mukhachitram TV.. ఆయేషా ఖాన్ పేరు గుర్తుందా.? గుర్తుండేంతలా ఆమెకి తెలుగు సినిమాల్లో పాపులారిటీ ఏమీ దక్కలేదు లెండి.!
తెలుగులో ‘ముఖచిత్రం’ అయేషా ఖాన్‌కి తొలి సినిమా. ఈ సినిమాలో ప్రియ వడ్లమాని మరో హీరోయిన్‌గా నటించింది.
సంఖ్యా పరంగా సినిమాలైతేనే బానే చేసింది. కానీ, సరైన సక్సెస్ రాలేదంతే. చివరికి ఐటమ్ సాంగ్ కూడా ట్రై చేసింది, వ్యాంప్ రోల్స్ అయినా.. ఓకే అనేసింది.
ప్చ్.. ప్రయోజనం లేకుండా పోయింది. దాంతో, ప్రస్తుతానికి బుల్లితెరకు పరిచయమైపోయిందీ బ్యూటీ.!
Ayesha Khan Mukhachitram TV.. బిగ్ బాస్ కూడా..
తెలుగులో కాదు.. హిందీ బిగ్ బాస్‌కి కూడా వెళ్ళింది అయేషా ఖాన్. ఆ తర్వాతే, ఆమె పాపులారిటీ నార్త్‌లో బాగా పెరిగింది. అలా, ఆమెకి పలు టీవీ సీరియళ్ళలో అవకాశాలొచ్చాయ్.
ప్రస్తుతానికైతే ఓ హిందీ సీరియల్‌లో నటిస్తోంది అయేషా ఖాన్. ఆమె గతంలో నటించిన కొన్ని తెలుగు సినిమాలు ఇంకా విడుదలకు నోచుకోలేదు.

సక్సెస్‌లు లేకపోయినా, అయేషా ఖాన్‌కి తెలుగు సినిమా ఆఫర్లు బాగానే వస్తున్నాయట. కానీ, సరైన పాత్రలు దొరక్కపోవడంతో, సినిమా అవకాశాల్ని లైట్ తీసుకుంటోందిట అయేషా ఖాన్.
Also Read: ‘లిటిల్ హార్ట్స్’ సమీక్ష: ఈ ‘తేడా’ వ్యవహారాలెందుకు చెప్మా.?
ఏమాటకామాటే చెప్పుకోవాలంటే.. అందం, అభినయం.. కలగలిసిన సర్‌ప్రైజ్ ప్యాకేజీ అయేషా ఖాన్. అన్నట్టు, అయేషా ఖాన్ మంచి డాన్సర్ కూడా.
లక్ కలిసొస్తే, స్టార్‌డమ్ రాత్రికి రాత్రే వచ్చేస్తుందని చాలామంది స్టార్లు నిరూపించారు. మరి, అయేషా ఖాన్ ఎప్పుడు లక్కు తోక తొక్కుతుందో.!