Sudheerbabu Fit And Perfect.. కండలు తిరిగే శరీరం.. అబ్బో, ఆ మజిల్స్ వేరే లెవల్.! ఇవేవీ సినిమాని హిట్టు చేయలేవ్. సినిమాకి కావాల్సింది సరైన కథ.!
నటుడు సుధీర్‌బాబు నిజంగానే సమ్‌థింగ్ స్పెషల్. మార్షల్ ఆర్ట్స్ అదరగొట్టేస్తాడు.. డాన్సుల సంగతి సరే సరి. యాక్టింగ్ స్కిల్స్ కూడా వున్నాయ్.!
సినిమా సినిమాకీ నటుడిగా పరిణతి చెందుతున్నాడు. కొత్త తరహా కథల్ని ఎంచుకుంటున్నాడు. కాకపోతే, ఆ కథలు ప్రేక్షకుల్ని మెప్పించలేకపోతున్నాయ్.
Sudheerbabu Fit And Perfect.. ఎక్కడ తేడా కొడుతోంది..?
తన కొత్త సినిమా కోసం ఇదిగో, ఇలా కష్టపడుతున్నాడు సుధీర్‌బాబు. నిజంగానే మెచ్చుకోవాలి ఈ విషయంలో సుధీర్‌బాబుని.
రొటీన్‌కి భిన్నంగా వుండే కథల్నే ఎంచుకుంటున్నాడుగానీ, ఎక్కడో వ్యవహారం తేడా కొడుతోంది.
తాజాగా ‘హరోంహర’ సినిమాతోనూ ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయాడు సుధీర్‌బాబు. ఎక్కడ తేడా కొడుతోందో ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన సమయమిది.
ప్రస్తుతం ఓ పాన్ ఇండియా సినిమా కోసం.. ఇదిగో ఇలా కండలు తిరిగిన శరీరాన్ని ఇంకోసారి సిద్ధం చేసేశాడు.
అఫ్‌కోర్స్ ఎప్పుడూ ఫిట్‌నెస్ విషయంలో అప్రమత్తంగానే వుంటాడనుకోండి. కాకపోతే, ఇలాంటి ప్రత్యేకమైన సినిమాల కోసం ఇంకాస్త ఎక్కువ కష్టపడతాడంతే.