Shakhahaari Telugu Review.. పేరేమో శాఖాహారం.. కానీ, కంటెంట్ మాత్రం నాన్ వెజ్.. అదేనండీ, మాంసాహారం.! అంటే, బ్లడ్ బాత్ అన్నమాట.!
మరీ, బ్లడ్ బాత్ ఎక్కువేం కాదుగానీ, అలా వెంటాడుతూనే వుంటుంది.. సినిమా చూస్తున్నంతసేపూ.!
కన్నడలో తెరకెక్కిన ‘శాఖాహారి’ సినిమా, ఓటీటీ పుణ్యమా అని తెలుగు ప్రేక్షకులకూ అందుబాటులోకి వచ్చింది.
రంగాయణ రఘు, గోపాలకృష్ణ దేశ్‌పాండే ఈ సినిమాలో ప్రధాన తారాగణం. ఒకరేమో, హోటల్ నడుపుకునే వ్యక్తి.. ఇంకొకరు పోలీస్ అధికారి.
Shakhahaari Telugu Review.. హత్య కేసు విచారణలో..
ఓ హత్య కేసు విచారిస్తున్న పోలీస్ అధికారి, ఆ హత్య కేసు నిందితుడ్ని కాపాడే ప్రయత్నంలో అనుకోకుండా తప్పు చేసే హోటల్ యజమాని.. ఈ ఇద్దరి మధ్య నడిచే సస్పెన్స్ థ్రిల్లర్ ఈ ‘శాఖాహారి’.!
ఈ సినిమా కన్నడలో మంచి విజయం సాధించిందట. సినిమా చూస్తున్నంతసేపూ కన్నడ సినిమా చూస్తున్నామన్న భావన కలగదు. మన తెలుగు సినిమా చూస్తున్నట్లే అనిపిస్తుంటుంది.
కొన్ని సన్నివేశాలు భయం పుట్టిస్తాయి.. కొన్ని సన్నివేశాలు నవ్వు తెప్పిస్తాయి. విధి నిర్వహణలో భాగంగా భార్యకు దూరమయ్యే భర్త.. ఈ క్రమంలో ఇంకో వ్యక్తితో ప్రేమలో పడే భార్య.. ఇవన్నీ కథలో కీలక ఘట్టాలే.
ట్విస్టులు బాబోయ్ ట్విస్టులు..
ఇదో మర్డర్ మిస్టరీ.! కాదు కాదు, మర్డర్స్ మిస్టరీ.! ‘శాఖాహారి’ సినిమా క్లయిమాక్స్‌లో అయితే ట్విస్టుల మీద ట్విస్టులు.!
రంగాయణ రఘు, హోటల్ యజమానిగా ఆ పాత్రలో జీవించేస్తే, పోలీస్ అధికారి గోపాలకృష్ణ దేశ్‌పాండే నటన కూడా ఆకట్టుకుంటుంది. మిగతా పాత్రధారులూ తమ పాత్రల పరిధి మేర బాగానే చేశారు.
Also Read: Keerthy Suresh: ‘రఘుతాత’ అసలేది ఈ ‘కత’.!
సంగీతం కావొచ్చు, సినిమాటోగ్రఫీ కావొచ్చు, ఎడిటింగ్ కావొచ్చు.. అన్నీ బాగా కుదిరాయి. థ్రిల్లర్ సినిమాల్ని ఇష్టపడేవారికి ఈ సినిమా బాగా నచ్చుతుంది.
అక్కడక్కడా కాస్త స్లోగా వుందనేగానీ, అదేమీ ఇబ్బందిగా అనిపించదు. ఓవరాల్‌గా ‘శాఖాహారి’ చూడదగ్గ సినిమానే.