అంజలి ‘బహిష్కరణ’: ‘ఆ సీన్స్’ ఎంజాయ్ చేశారా.? లేదా.?

Anjali Bahishkarana
Anjali Bahishkarana.. సినిమా ప్రెస్ మీట్లు ఈ మధ్యకాలంలో అత్యంత జుగుప్సాకరంగా తయారవుతున్నాయి.!
జర్నలిజం ముసుగులో కొందరు ఎర్నలిస్టులు, సినీ ప్రముఖుల్ని అడుగుతున్న ప్రశ్నల్లో అసభ్యత తారాస్థాయికి చేరుతోంది. అలాంటి ఓ ప్రశ్న గురించే ఇక్కడ ప్రస్తావించుకుంటున్నాం.
‘సినిమాలో ఇంటిమేట్ సీన్స్ వున్నాయి కదా.. వాటిని మీరిద్దరూ (నటీనటులు) ఎంజాయ్ చేశారా.?’ అన్నది ఆ ప్రశ్న తాలూకు సారాంశం.
Anjali Bahishkarana.. బహిష్కరణలో అసభ్యత వుందా.?
అంలి ప్రధాన పాత్రలో తెరకెక్కిన వెబ్ సిరీస్ ‘బహిష్కరణ’, అనన్య నాగల్ల తదితరులు ఇతర ప్రధాన తారాగణం.
ఓ ఊరి పెద్ద చేసే అకృత్యాలు.. ఓ వేశ్య, చిన్న కులానికి చెందిన వ్యక్తుల చుట్టూ నడిచే కథతో ఈ వెబ్ సిరీస్ రూపొందింది.
వేశ్య పాత్రలో అంజలి నటించింది. సహజంగానే ఆమె పాత్రకి ఒకింత హాట్ అప్పీల్ వుంటుంది. అలాగని, మరీ అంత ఎక్కువగా ఇంటిమేట్ సీన్స్ ఏమీ లేవు.
పాత తెలుగు సినిమాల్లో..
ఒకప్పుడు తెలుగు తెరపై రేప్ స్పెషలిస్టులుగా కొందరు నటులు గుర్తింపు పొందారు. ఆ సన్నివేశాల కోసమే.. అన్నట్లు ఫిమేల్ ఆర్టిస్టులు కూడా వుండేవారు.

అప్పట్లో ఆ అసభ్యత అత్యంత జుగుప్సాకరంగా వుండేది. కాకపోతే, ఆ సీన్‌లో టెంపో కోసమే అదంతా చేసేవారు.
ఇప్పుడో మరి.? కక్కుర్తి.. ఔను, కక్కుర్తి తప్ప ఏమీ వుండట్లేదు వెబ్ సిరీస్‌లు అయినా, సినిమాలు అయినా.! ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా ఇది నిజం.
కక్కుర్తి బహిష్కరణలో వుందా.?
చిత్రమేంటంటే, అంత కక్కుర్తి ‘బహిష్కరణ’ సినిమాలో లేదు. సమస్య తీవ్రతను దర్శకుడు బాగానే చూపించగలిగాడు. సాగతీత.. అన్నది ఓ పెద్ద కంప్లయింట్ ఈ వెబ్ సిరీస్‌కి సంబంధించి అది వేరే చర్చ.
అంజలికి సంబంధించి రెండు మూడు బెడ్ రూమ్ సీన్స్ వుంటాయి.. అవీ, హద్దులు దాటి ఏమీ వుండవ్. అయినా, ఇక్కడ నటీనటులు ఎంజాయ్ చేయడానికి ఏముంటుంది.?
Also Read: అతనికి ఏభయ్యారు.! ఆమెకి ఇరవయ్యారు.! ఎందుకీ వల్గర్ కెమిస్ట్రీ.?
ఎక్కువ మంది షూటింగ్ స్పాట్‌లో లేకుండా, చాలా తక్కువమందితో ఆ సన్నివేశాల్ని చిత్రీకరించినట్లు అంజలి చెప్పింది.
కానీ, మీడియా నుంచి వచ్చిన ప్రశ్నలు మాత్రం, ‘ఆ సన్నివేశాల్లో మీరు ఎంజాయ్ చేశారా.?’ అని. ఎంజాయ్ చేయడమంటే ఏంటిక్కడ.?
కామం నిండిన కళ్ళతో జర్నలిస్టులు, ఆ సన్నివేశాల్ని అంతకు మించి ఊహించుకున్నారేమో.! అందుకే, ఈ ప్రశ్న వాళ్ళ నోటి వెంట వచ్చింది.
