Table of Contents
Dokka Seethamma Jana Sena.. ఎవరీ డొక్కా సీతమ్మ.? జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పదే పదే ‘డొక్కా సీతమ్మ’ పేరుని ఎందుకు ప్రస్తావిస్తుంటారు.?
ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించాక, ఓ సందర్భంలో, జనసేనాని పవన్ కళ్యాణ్ ‘డొక్కా సీతమ్మ’ పేరుతో కూడా ‘క్యాంటీన్లు’ వుంటాయ్.. అని ప్రకటించిన సంగతి తెలిసిందే.
సంక్షేమ పథకాలకు పార్టీలకతీతంగా ఆలోచించి మహనీయుల పేర్లను పెట్టగలిగితే.. ఆ మహనీయుల గురించి స్మరించుకునే అవకాశం మనకు దక్కుతుంది. మన చరిత్రని మనం గౌరవించుకునే పద్ధతి ఇది.!
Mudra369
వాస్తవానికి, చాలాకాలంగా ‘డొక్కా సీతమ్మ’ అనే పేరుకి ప్రాచుర్యం కల్పించేందుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Jana Sena Party Chief Pawan Kalyan) ప్రయత్నిస్తూ వస్తున్నారు.
Dokka Seethamma Jana Sena.. డొక్కా సీతమ్మ పేరుతో ఆహార పంపిణీ కేంద్రాలు..
భవన నిర్మాణ రంగ కార్మికుల కోసం జనసేన పార్టీ (Jana Sena Party) గతంలో, ‘డొక్కా సీతమ్మ’ పేరుతో, ఆహార పంపిణీ కేంద్రాల్ని ఏర్పాటు చేసింది.
అలా, ‘డొక్కా సీతమ్మ’ గురించి అందరూ చర్చించుకోవడం మొదలు పెట్టారు. ఇంతకీ, ఎవరీ డొక్కా సీతమ్మ.?

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా లంకల గన్నవరంలో 1841లో జన్మించారు డొక్కా సీతమ్మ. డొక్కా సీతమ్మ ఖ్యాతి ఎంతటిదంంటే, ఆమె జీవిత చరిత్రను పాఠ్యాంశంగానూ చేర్చారు.
కుల, మత, జాతి, గొప్ప, బీద.. ఇలాంటి తేడాలేవీ లేకుండా, ఏ వేళ ఎవరు వచ్చినా, ‘లేదనకుండా’ ఆదరించి, అన్నం పెట్టి కడుపు నింపేవారట ొక్కా సీతమ్మ.
బ్రిటిష్ ప్రభుత్వం నుంచి యోగ్యతా పత్రం..
నరసమ్మ, భవానీ శంకరుడు ఆమె తల్లిదండ్రులు. పుట్టినింట సంపద అంతంత మాత్రమే అయినా, చిన్నప్పటినుంచే దానధర్మాలు చేయడం అలవాటైందామెకి.
మెట్టినింట అడుగు పెట్టాక, ఆ కుటుంబం సంపదలో మేటి కావడంతో, ఆమె సేవా కార్యక్రమాలకు మరింత ఊతం లభించినట్లయ్యింది. భర్త డొక్కా జోగన్న, తన భార్య చేస్తున్న సేవా కార్యక్రమాలకు మద్దతు పలికారు.
2019 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసినప్పుడు, జనసేన పార్టీ మేనిఫెస్టోలోనూ ‘డొక్కా సీతమ్మ పేరుతో పేదల కోసం క్యాంటీన్లను ఏర్పాటు చేస్తాం’ అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
Mudra369
అలా అలా డొక్కా సీతమ్మ సేవల గురించి అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం కూడా తెలుసుకుంది. అప్పటి బ్రిటిష్ చక్రవర్తి ఏడో ఎడ్వర్డ్, డొక్కా సీతమ్మ దాతృత్వాన్ని ప్రశంసిస్తూ యోగ్యతా పత్రంతో ఆమెను సత్కరించారు.
అప్పట్లో ప్రతి యేటా లండన్‌లో జరిగే చక్రవర్తి పట్టాభిషేక ఉత్సవాల్లోనూ దర్బారు హాల్లో సీతమ్మ ఫొటో పెట్టేందుకు ఆదేశాలు జారీ చేయడం జరిగిందట.
డొక్కా సీతమ్మ బడి భోజనం..
మరి, ఇంతటి ఖ్యాతిని డొక్కా సీతమ్మ గడించినా, నేటి తరానికి ఆమె ఎవరో తెలియకపోవడమేంటి.? అదే, మన దుస్థితి అనుకోవాలేమో.
కాగా, వైసీపీ హయాంలో ‘జగనన్న గోరు ముద్ద’ పేరుతో అమలయిన సంక్షేమ పథకం పేరు మార్చి, ‘డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం’ అనే పేరు పెట్టారు.

ఈ నిర్ణయంపై డొక్కా సీతమ్మ (Dokka Seethamma) వారసులు హర్షం వ్యక్తం చేశారు. ఆంద్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Andhra Pradesh Deputy Chief Minister Pawan Kalyan)కి కృతజ్ఞతలు తెలిపారు.
Also Read: వైకల్యానికి కోటా ఎందుకని ప్రశ్నించినందుకే ఆమెని రక్కేస్తారా?
మరోపక్క, ఉభయ గోదావరి జిల్లాల్లో ఇప్పుడు ఎక్కడ విన్నా, ‘డొక్కా సీతమ్మ’ సేవల గురించిన చర్చే జరుగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగానూ జనం ఈ విషయమై చర్చించుకుంటున్నారు.