వైకల్యానికి కోటా ఎందుకని ప్రశ్నించినందుకే ఆమెని రక్కేస్తారా?
Smita Sabharwal IAS.. సీనియర్ ఐఏఎస్ అధికారిణి స్మిత సభర్వాల్ ‘వైకల్యానికి కోటా’ విషయమై తన అభిప్రాయాన్ని కుండబద్దలుగొట్టారు.
అంతే, ఆమె మీద పడి రక్కేస్తున్నారు కొందరు మెయిన్ స్ట్రీమ్ మీడియా వేదికగా.. అలాగే, సోషల్ మీడియా వేదికగా కూడా.!
ప్రజాస్వామ్యమంటే ఏంటి.? అందులో ప్రజలకు వున్న హక్కులేంటి.? ఓ సీనియర్ ఐఏఎస్ అధికారిణిగా స్మిత సభర్వాల్ తన అభిప్రాయం చెప్పడం నేరమా.?
Smita Sabharwal IAS.. అయినా ఆమె మాటల్లో తప్పేముంది.?
ఐఏఎస్, ఐపీఎస్ వంటి విభాగాల్లో వికలాంగులకు రిజర్వేషన్లు ఎంతవరకు సబబు.? ఆయా బాధ్యతలు నిర్వహించాల్సిన అధికారులు, ఎక్కువ దూరం ప్రయాణించాల్సి వుంటుంది కదా.?
వాళ్ళు శారీరకంగా ధృఢంగా వుండాలి.. ఇదీ స్మిత సభర్వాల్ లేవనెత్తిన అంశం.
ఔను కదా.! స్మిత సభర్వాల్ వాదనలో నిజముంది కదా.? ఇంకా నయ్యం.. ఇలా ఎవరైనా అంటే, వాళ్ళ మీద పడి కూడా రక్కేస్తుంది సమాజం.!
నిజమే, వికలాంగులకి అన్నింటా సమాన అవకాశాలు కల్పించాలి. సమాన అవకాశాలు సరే, ప్రత్యేక రిజర్వేషన్లు ఎందుకు.? అన్న చర్చ సహజంగానే తెరపైకొస్తుంది.
ఎందుకంటే, మిగతావాళ్ళతో వికలాంగులతో పోటీ పడలేరు. అలాంటి వారికి ప్రత్యేకంగా అవకాశాలు కల్పించాల్సిందే. కానీ, ఆ కల్పించే విధానం మీదనే అభ్యంతరాలున్నాయ్.
సమస్య లోతుల్ని తెలుసుకోవాలి కదా.?
అసలంటూ, కులం పేరుతో రిజర్వేషన్లను సైతం ఎత్తేయాలనే డిమాండ్లను చూస్తుంటాం. సామాజిక వర్గ కోణంలో రిజర్వేషన్లు పొందుతున్నవారు సైతం, రిజర్వేషన్లను వ్యతిరేకిస్తున్న సందర్భాలు కోకొల్లలు.. అది వేరే చర్చ.
ఓ ఐఏఎస్ అధికారిగా, సుదీర్ఘ ప్రయాణంలో.. తాను ఎదుర్కొన్న ప్రత్యేక పరిస్థితుల్ని పరిగణనలోకి తీసుకుని, వికలాంగులకు ఐఏఎస్, ఐపీఎస్ తదితర విభాగాల్లో రిజర్వేషన్లు ఎందుకన్న ప్రశ్నని స్మిత సభర్వాల్ లేవనెత్తి వుండొచ్చు.
Also Read: బిగ్ క్వశ్చన్: ఇంటర్మీడియట్ తర్వాత ఏం చేయాలి.?
ప్రజాస్వామ్యమంటే.. చర్చ జరగాలి.! అప్పుడే, అది ప్రజాస్వామ్యమవుతుంది. రాజకీయ కోణంలో, ఇలాంటి అంశాలపై చర్చ జరిగేందుకు ఆస్కారం లేకుండా పోతే ఎలా.?
ఎవరికైనా స్మిత సభర్వాల్ వాదనపై అభ్యంతరాలుంటే, ఆమె వాదనల్ని ఖండించొచ్చు. ఈ విషయమై తమ వాదనల్ని వినిపించొచ్చు. తప్పు లేదు.!
కానీ, వ్యక్తిగత విమర్శలు.. దారుణమైన ట్రోలింగ్.. ముమ్మాటికీ తప్పే.!