Table of Contents
Allu Arjun Nandyal Row.. అదేంటీ, స్నేహితుడు గెలవాలని ఆకాంక్షిస్తూ, ఆ స్నేహితుడికి నైతిక మద్దతుగా నిలిచేందుకు కదా, ఎన్నికల సమయంలో వెళ్ళింది.?
ఇటీవల ఆంధ్ర ప్రదేశ్‌లో జరిగిన అసెంబ్లీ, సార్వత్రిక ఎన్నికల సమయంలో, సినీ నటుడు అల్లు అర్జున్ తన స్నేహితుడు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ఇంటికి వెళ్ళారు.
శిల్పా రవి చంద్ర రెడ్డి వైసీపీ నేత.! పైగా, గతంలో ఈయన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద తీవ్ర రాజకీయ విమర్శలు చేశారు.
మరోపక్క, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్వయానా అల్లు అర్జున్‌కి బంధువు. మామూలుగా అయితే, పవన్ కళ్యాణ్ మీద రాజకీయ విమర్శలు చేసిన శిల్పా రవిచంద్రా రెడ్డితో స్నేహాన్ని అల్లు అర్జున్ వదులుకుని వుండాలి.
సినిమా.. రాజకీయం.. కలగలిపేసి..
సరే.. రాజకీయాలు వేరు, సినిమాలు వేరని అనుకుందాం.! జనసేన పార్టీకి అత్యంత కీలకమైన ఎన్నికలవి. అలాంటప్పుడు, అల్లు అర్జున్ ఎంత బాధ్యతగా వుండాలి.?
పోనీ, స్నేహితుడు గనుక.. నంద్యాలకు వెళ్ళాడు.. అదీ తప్పు కాకపోవచ్చు.! వెళ్ళి, ఆ తర్వాత మీడియా ముందుకొచ్చి ఏం చెప్పాడు.?

‘రవి నన్ను పిలవలేదు. వద్దని కూడా అన్నాడు. కానీ, నేనే వచ్చాను..’ అని సెలవిచ్చాడు. దానర్థమేంటి.? జనసేనకి వ్యతిరేకంగా అల్లు అర్జున్ పావులు కదిపినట్లే భావించాలి కదా.!
ఇది కూడా పక్కన పెట్టేద్దాం.! ఔను, స్నేహితుడి కోసం వెళ్ళాను.. అతను గెలవాలని ఆకాంక్షించాను. పరోక్షంగా వైసీపీకి మద్దతిచ్చాను.. అని చెప్పుకోవచ్చు కదా.?
Allu Arjun Nandyal Row.. ఎన్నికల కోడ్ ఉల్లంఘన..
ఈ పర్యటన పేరుతో అల్లు అర్జున్ చేసిన పబ్లిసిటీ స్టంట్ నేపథ్యంలో ‘ఎన్నికల కోడ్ ఉల్లంఘన’ కేసు అతని మీద అప్పట్లోనే నమోదైంది.
ఆ కేసుని కొట్టేయమని తాజాగా అల్లు అర్జున్ కోర్టును ఆశ్రయించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. స్నేహితుడి ఇంటికి వెళ్ళాను తప్ప, రాజకీయం ఏమీ లేదని సెలవిచ్చాడు అల్లు అర్జున్, కోర్టుకి చేసిన అభ్యర్థనలో.
ఎన్నికల ప్రచారం సమయంలో ఫైరు.. కోర్టు ముందరేమో ఫ్లవరు.!
Allu Arjun
బోల్డంతమంది వైసీపీ కార్యకర్తలు, దాంతోపాటుగా అల్లు అర్జున్ (Allu Arjun) అభిమానులు.. వెరసి, వందల మందిలో గుమికూడి, నాన్సెన్స్ క్రియేట్ చేశారక్కడ.
ముందస్తు అనుమతుల్లేకుండా ఎన్నికల సమయంలో జనాల్ని పోగెయ్యడమంటే, ఎన్నికల కోడ్‌ని ఉల్లంఘించినట్లే కదా.?
పైగా, వైసీపీ అభ్యర్థికి అలాగే వైసీపీకి అల్లు అర్జున్ మద్దతు తెలిపినట్లు, ఈ మొత్తం వ్యవహారంపై అప్పట్లో వైసీపీ అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్ నుంచి పోస్టులు పడ్డాయ్.
అడ్డంగా బుక్కయిపోయావ్ పుష్పా.!
ఎలా చూసినా, అల్లు అర్జున్ నంద్యాల పర్యటన పూర్తిగా రాజకీయ కోణంలో జరిగిందే.! సో, ఎన్నికల కోడ్ ఉల్లంఘన జరిగింది.
ఇప్పుడు ప్లేటు ఫిరాయించి లాభం లేదు.! అప్పుడే, కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకుని వుండాల్సింది అల్లు అర్జున్ (Icon Star Allu Arjun).!
సినిమాల్లో అయితే, ‘తగ్గేదే లే.. అస్సలు తగ్గేదే లే..’ అని డైలాగులు చెప్పొచ్చు. కానీ, నిజ జీవితంలో కుదరదు.! తగ్గాలి.. తలొగ్గాలి.. లేకపోతే, వ్యవస్థలు తాట తీసేస్తాయ్!