ఫ్యాన్ ఇంట్లో.! గ్లాస్ సింక్‌లో.! వాట్ నాన్సెన్స్ ఈజ్ దిస్.!

 ఫ్యాన్ ఇంట్లో.! గ్లాస్ సింక్‌లో.! వాట్ నాన్సెన్స్ ఈజ్ దిస్.!

YS Jagan Mohan Reddy

YSRCP Fan JSP Glass ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్.. అస్సలు పేలలేదు.! పెయిడ్ బ్యాచ్ అంతా, ‘ఆహా.. ఓహో’ అంటున్నారు.. అనాలి కూడా.!

అలా అనేందుకే కదా, వాళ్ళకి చెల్లింపులు జరుగుతున్నాయ్.! వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏం చెప్పినా, తలకాయ ఆడించే గంగిరెద్దులు చాలానే వున్నాయ్.!

ఫ్యాన్ ఎప్పుడూ ఇంట్లోనే ఎందుకు వుండాలి.? సైకిల్ ఎప్పుడూ బయటే ఎందుకు వుండాలి.? తాగేసిన టీ గ్లాస్ ఎప్పుడూ సింక్‌లోనే ఎందుకు వుండాలి.?

YSRCP Fan JSP Glass.. చెత్త స్క్రిప్టు రాసిందెవరు?

ప్రశ్నలు వస్తాయ్ కదా.! అవి ఆలోచించకుండా ఆ చెత్త స్క్రిప్ట్ రాసిందెవరో ఏమోగానీ, ఏమాత్రం ఆలోచించకుండా.. దాన్ని యధాతథంగా చదివేశారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.

టీ తాగాక, గ్లాస్ కడుక్కుంటాం.! మళ్ళీ ఇంకోసారి అదే గ్లాసులో టీ తాగుతాం.! సైకిల్ బయటే ఎందుకు వుంటుంది.? సాయంత్రం ఇంట్లో పెడతాం, పొద్దున్నే బయటకు తీస్తాం. పనులు చూసుకుని వస్తాం.!

ఇక, ఫ్యాన్ సంగతి.. కరెంట్ వుంటేనే ఫ్యాన్ తిరుగుతుంది. పాడైపోయిన ఫ్యాన్‌ని ఇంట్లో ఎవరైనా వుంచుకుంటారా.?

ఆర్గ్యుమెంట్స్ చేస్తే.. ఇదిగో ఇలాగే వుంటుంది మరి.! అయినా, ఏసీలు వాడుతున్నాక, ఫ్యాన్‌తో పనేముంటుంది.? అనే ప్రశ్న కూడా తెరపైకొస్తుంటుంది.

ఎన్నికల గుర్తులతో పనేంటసలు.?

వైసీపీ అధినేతకి, ఇతర పార్టీల ఎన్నికల గుర్తులతో పనేంటసలు.? వైనాట్ 175 అనే మాట మీదున్నప్పుడు, జనానికి కొత్తగా ఏం చేస్తారో చెప్పాలి.!

మద్య నిషేధం వంటివి ఎందుకు చేయలేకపోయారో వివరణ ఇచ్చుకోవాలి కదా.? ప్రత్యేక హోదా ఎందుకు రాలేదు.? పోలవరం ప్రాజెక్టు ఎందుకు పూర్తి కాలేదు.? ఇవి కదా డిబేటబుల్ అంశాలు.!

Also Read: వెండితెరపై విష ప్రయోగం! నువ్వు తినేది ‘కక్కిన కూడు’!

రాష్ట్రానికి కావాల్సింది రాజధాని.! దాని గురించి ముఖ్యమంత్రి మాట్లాడరేం.? చొక్కాలు మడతబెట్టమంటారు.. ఫ్యాన్లు, సైకిళ్ళు, గ్లాసులంటారు.!

వాట్ నాన్సెన్స్ ఈజ్ దిస్.? పరిపాలన అంటే జవాబుదారీతనం.! కానీ, ఇప్పుడు పరిపాలన అంటే, ఇదిగో.. ఇలా చిల్లరతనం అయిపోయింది.!

Digiqole Ad

Related post