Game Changer Shreya Ghoshal.. సింగర్ శ్రేయా ఘోషల్ గురించి కొత్తగా పరిచయం చేసేదేముంది.? గాన కోకిల.. అనేయొచ్చు నిస్సందేహంగా.!
మెలోడీ క్వీన్ అని కూడా అంటుంటారు శ్రేయా ఘోషల్ గురించి. ఏ భాషలో అయినా, చాలా అవలీలగా పాటలు పాడేస్తుంటుంది శ్రేయా ఘోషల్.
తెలుగమ్మాయ్ కాకపోయినా, తెలుగులోనూ చాలా చాలా అందంగా పాటలు పాడేసి, తెలుగు ప్రేక్షకుల మన్ననలు పొందిన శ్రేయా ఘోషల్.. సుదీర్ఘ కాలంగా టాప్ సింగర్ అనే గుర్తింపుని కాపాడుకుంటూ వస్తోంది.
Game Changer Shreya Ghoshal.. గేమ్ ఛేంజర్ శ్రేయా ఘోషల్..
తాజాగా, ‘గేమ్ ఛేంజర్’ కోసం శ్రేయా ఘోషల్ ఓ పాట పాడింది. తమన్ సంగీతం అందిస్తున్నాడు ‘గేమ్ ఛేంజర్’ సినిమాకి.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘గేమ్ ఛేంజర్’ సినిమాలో కైరా అద్వానీ హీరోయిన్‌గా నటించిన సంగతి తెలిసిందే.

కాగా, ఈ సినిమా కోసం మూడు భాషల్లో ఓ పాట పాడింది శ్రేయా ఘోషల్. అది కూడా, కేవలం 90 నిమిషాల్లో పాటలు పాడెయ్యడం పూర్తి చేసేసిందట.
ఈ విషయాన్ని స్వయంగా సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు సంగీత దర్శకుడు తమన్. నైటేంగిల్.. అంటూ శ్రేయా ఘోషల్ గురించి తమన్ పేర్కొన్నాడు. ఏకంగా క్రికెటర్ క్రిస్ గేల్‌తోనూ పోల్చాడు.!
2025 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది ‘గేమ్ ఛేంజర్’. జనవరి 10న సినిమా విడుదల కానుండగా, సినిమా ప్రమోషన్స్ త్వరలో షురూ చేయనున్నారు.
ఇప్పటికే ‘గేమ్ ఛేంజర్’ నుంచి రెండు పాటలొచ్చాయ్.. రెండు పాటలూ యూ ట్యూబ్‌లో మిలియన్ల కొద్దీ వ్యూస్ కొల్లగొడుతున్న సంగతి తెలిసిందే.