వెండితెరపై విష ప్రయోగం! నువ్వు తినేది ‘కక్కిన కూడు’!

 వెండితెరపై విష ప్రయోగం! నువ్వు తినేది ‘కక్కిన కూడు’!

Rajadhani Files

Rajadhani Files Blue Media.. ‘రాజధాని ఫైల్స్’ పేరుతో ఓ సినిమా విడుదలకు సిద్ధమైంది. ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతి గురించిన సినిమా ఇది.! ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల గురించిన సినిమా ఇది.!

అమరావతిని కాస్తా ఐరావతిగా పేర్కొన్నారు. సెటైరికల్ సినిమాలన్నాక ఇలాంటివన్నీ మామూలే.! ఆ మధ్య రామ్ గోపాల్ వర్మ ఏదో పనికిమాలిన సినిమా ఒకటి తీశాడు.!

సినిమా టైటిల్ విషయమై రచ్చ జరిగింది.. టైటిల్ మార్చాడు. ఇంకో పనికిమాలిన సినిమా పవన్ కళ్యాణ్ మీద తీశాడు.. వర్మకి ఇలాంటివి అలవాటే.

Rajadhani Files Blue Media.. వర్మ.. ఖర్మ.. అది వేరే పంచాయితీ..

ఎవరో డబ్బులిస్తారు.. ఏవేవో తీస్తాడు.! సోషల్ మీడియాలో అతన్ని ఫాలో అయ్యే పనికిమాలిన మంద చాలామందే వుంటారు గనుక, పబ్లిసిటీ హడావిడికి కొదవేం వుండదు.

‘వ్యూహం’ పేరుతో వర్మ తీసిన సినిమా, విడుదలకు నోచుకోవడంలేదు. న్యాయస్థానం ముందర ముక్కుతూ ముక్కుతూ వుంది వర్మ ‘వ్యూహం’.!

వాస్తవానికి, ఈ తరహా సినీ రాజకీయ పెంట ఇప్పుడు కొత్తగా చూస్తున్నది కాదు. గతంలోనూ వున్నదే. అప్పటి పరిస్థితులు వేరు, ఇప్పటి పైత్యం వేరు.

అన్నట్టు, ‘యాత్ర-2’ అంటూ మహి వి రాఘవ ఓ సినిమా తెరకెక్కించాడు. అదీ విడుదలకు సిద్ధమయ్యింది. ఇది కూడా పైన చూపించిన సినిమాల బాపతే.

అనుకూలం.. వ్యతిరేకం..

కాకపోతే, అనుకూల సినిమాలు, వ్యతిరేక సినిమాలు.. ఈ తేడా స్పష్టంగా వుంటుంది. నచ్చిన పార్టీకి కొమ్ము కాస్తూ సినిమా తీయడం వేరు, నచ్చని పార్టీపై విషం చిమ్మడం వేరు.

మహి వి రాఘవని మొదటి ఖాతాలో వేయొచ్చు. అది వైసీపీ అనుకూల సినిమా అంతే.! దీన్ని నిజానికి తప్పు పట్టలేం. ఆ మాటకొస్తే, దేన్నీ తప్పు పట్టలేం.

ఈ మాత్రందానికి ఏకంగా ‘వెండితెరపై విష ప్రయోగం’ అంటూ, ‘రాజధాని ఫైల్స్’ సినిమా మీద ఓ పనికిమాలిన కథనం ప్రచారంలోకి వచ్చింది.. అదీ ఓ వెబ్ మీడియా సంస్థ ద్వారా.

కక్కిన కూడు..

పొద్దున్న లేస్తే, అందులో వైసీపీ అనుకూల కంటెంట్ కంటే, పవన్ కళ్యాణ్‌ని ద్వేషించేలా, చిరంజీవి అంటేనే చిర్రెత్తుకొచ్చేలా.. చంద్రబాబు పేరెత్తితే కంపరం వచ్చేలా.. అన్నట్టు కథనాలు దర్శనమిస్తాయ్.

ఇలాంటి పెంటని పాఠకుల మీద రుద్ది, ఆ ‘ఛండాలంతో’ వచ్చే, ‘కక్కిన కూడు’ని కుటుంబ సభ్యులకి ఎలా పెడుతున్నారో ఆ వెబ్ సైట్ నిర్వాహకులు.

Also Read: విజయ్ కొత్త పొలిటికల్ పార్టీ: తమిళగ వెట్రి కజగం.!

విషం.. విషం.. విషం.. ఆ విషానికి పర్యాయ పదంగా మారిపోయిన ది గ్రేట్ అండ్ డర్టీ వెబ్ సైట్ నుంచి, ‘వెండి తెరపై విష ప్రయోగం’ లాంటి పెద్ద మాటలు వస్తే, నోటితో కాదు.. వేరే దేంతోనో నవ్వాల్సి వస్తుంది.! ఎనీ డౌట్స్.?

మీడియా ముసుగులో మాఫియా రాతలో.. సినిమాల మాటున విషం చిమ్మే సెటైరికల్ సినిమాలో.. ఇవేవీ ఓటర్ల ఆలోచనల్ని మార్చలేవు.

వాస్తవానికి, ఇలాంటి సినిమాలు చూసేవాళ్ళని మానసిక రోగులని కూడా అనొచ్చు. అలాంటివారి సంఖ్య చాలా చాలా తక్కువ. అలాంటప్పుడు, ఇలాంటి సినిమాల్ని చూసి భుజాలు తడుముకోవడమంటే.. దాన్నేమనాలి.?

Digiqole Ad

Related post